Home జాతీయ వార్తలు దుర్గ గుడి ఇఒగా పద్మ

దుర్గ గుడి ఇఒగా పద్మ

PADMA-1

అమరావతి : విజయవాడ దుర్గ గుడి ఇఒగా ఐఎఎస్ అధికారిణి డాక్టర్ పద్మను నియమించారు. మంగళవారం నలుగురు ఐఎఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ క్రమంలో పద్మను దుర్గ గుడి ఇఒగా నియమించారు. పద్మ ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.2004 బ్యాచ్‌కు చెందిన పద్మ గురువారం దుర్గ గుడి ఇఒగా బాధ్యతలు స్వీకరిస్తారు. అదేవిధంగా రోడ్డు భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్, పశుసంవర్థక శాఖ, మత్సశాఖ కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిలను నియమించింది. సీనియర్ ఐఎఎస్ అధికారి జెఎస్‌వి ప్రసాద్‌ను రిజర్వ్‌లో ఉంచింది. జిఎడిలో రిపోర్టు చేయాలని ప్రసాద్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

IAS Officer Padma Appointed as Durga Temple EO