Home తాజా వార్తలు నేడు పార్టీని ప్రారంభించనున్న మాజీ యువ ఐఏఎస్

నేడు పార్టీని ప్రారంభించనున్న మాజీ యువ ఐఏఎస్

IAS officer Shah Faesal

 

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌కు చెందిన మాజీ ఐఎఎస్ ఆఫీసర్ షా ఫైజల్ ఆదివారం జమ్ము అండ్ కశ్మీర్ పీపుల్స్ మూమెంట్ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. రాజ్‌బాగ్ పట్టణంలోని గిండున్ మైదానంలో ఆదివారం జరిగే కార్యక్రమంలో పార్టీని ప్రారంభించనున్నట్లు ఫైజల్ వెల్లడించాారు. యుపిఎస్ సి 2010 బ్యాచ్ టాపర్ అయిన పైజల్.. కలెక్టరు పదవికి జనవరి 2019లో రాజీనామా చేశారు. కశ్మీరీలపై నిరంతరంగా కొనసాగుతున్న ఆకృత్యాలు, అణచివేతలపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. తనకు మద్దతుగా నిలిచేందుకు కశ్మీర్ యువత సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

 

IAS officer Shah Faesal Announces to political party