Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఛాంపియన్స్ ట్రోఫీకి మరింత భద్రత

ICC

దుబాయి: మాంచెస్టర్‌లో ఎరీనాలో ఉగ్రదాడు లు జరిగిన నేపథ్యంలో ఇంగ్లాండ్‌లో జరిగే ఛాం పియన్స్ ట్రోఫీకి భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్ణ యించింది. జూన్ ఒకటి నుంచి 18 వరకు ఇం గ్లాండ్‌లో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనున్న విషయం తెలిసిందే. తాజాగా మాం చెస్టర్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటనలో చాలా మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఛాం పియన్స్ ట్రోఫీ భద్రత ఏర్పాట్లపై ఐసిసి, ఇంగ్లాం డ్, వెల్స్ క్రికెట్ బోర్డులు మరోసారి సమీక్షా నిర్వ హించాయి. ప్రపంచంలో అగ్రశ్రేణి వన్డే జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నమెంట్‌లో భద్రత ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని నిర్ణయిం చారు. ఈ మేరకు మంగళవారం ఐసిసి, ఇంగ్లాం డ్ క్రికెట్ బోర్డు (ఈసిబి) అధికారులు సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా భద్రతకు తీసుకో వాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటిలో భద్రతాధికారులు కూడా పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరు గకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, దీని కోసం అవసరమైతే మైదానంలో ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు. టోర్నీలో పాల్గొనే క్రికెటర్లకు, అధికారులకు, మ్యాచ్‌లను తిలకించేందుకు వచ్చే అభిమానుల కు పూర్తి భద్రత కల్పించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. దీని కోం తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చించారు. త్వరలోనే కొత్త భద్రత నిబంధనలను వెల్లడిస్తామని, ఈ సందర్భంగా మ్యాచ్ నిర్వహణ కోసం పలు కఠిన నిబంధనలు విధించనున్నట్టు అధికారులు తెలి పారు. అవసరమైతే దీని కోసం టోర్నీలో పాల్గొం టున్న దేశాలకు చెందిన ప్రభుత్వాల నుంచి మద్దతు తీసుకోవాలని సమావేశంలో తీర్మానిం చారు. కాగా, ఉగ్రదాడుల నేపథ్యంలో టోర్నమెం ట్‌ను రద్దు చేస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఐసిసి, ఈసిబిలు ఒక ప్రకటనలో స్పష్టం చేశా యి. ఎటువంటి సంఘటనలు జరుగకుండా టోర్నీని విజయవంతంగా నిర్వహించే సత్తా తమ కుందని ఇంగ్లాండ్ ప్రభుత్వం కూడా ప్రకటిం చింది.

Comments

comments