Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

టెస్టు క్రికెట్‌లో ‘టాస్’కు గుడ్‌బై!

 Goodbye to 'toss' in Test cricket

 టెస్ట్ క్రికెట్‌ను మెరుగుపరచడానికి ఐసిసి ప్రయత్నిస్తోంది
 ముంబయిలో మే 28-29న ఐసిసి సభ్యుల సమావేశం
టెస్ట్ క్రికెట్‌లో ‘టాస్’ వేయడం అన్నది ఓ సంప్రదాయంగా మారింది

దుబాయ్: క్రికెట్ మ్యాచ్‌లు వీక్షించే ప్రతి ఒక్కరికీ టాస్‌కు ఉండే విశిష్టత గురించి తెలుసు. మ్యాచ్‌లో ఏ జట్టు ముందుగా బ్యాటింగ్, బౌలింగ్ చేపట్టాలన్నది టాస్ మీదే ఆధారపడి ఉంటుంది. కానీ భవిష్యత్తులో టెస్ట్ మ్యాచ్‌లలో టాస్ విధానానికి మంగళం పాడాలని ఐసీసీ భావిస్తున్నట్టు సమాచారం. 1877లో మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు మధ్య జరిగిన తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ నుంచి ఈ విధానం అమల్లో ఉంది. ఆతిథేయ జట్టు కెప్టెన్ కాయిన్‌ను గాలిలోకి ఎగురవేసినప్పుడు బొమ్మా, బొరుసా అనేది చెప్పడం పర్యాటక జట్టు కెప్టెన్ చెప్పడం పరిపాటి. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) టెస్ట్ క్రికెట్‌ను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తోంది. బ్యాటింగ్‌ను ఎంచుకోవాలా లేక ఫీల్డింగ్‌ను ఎంచుకోవాలో నిర్ణయించుకునే అవకాశం పర్యాటక జట్టు కెప్టెన్‌కు ఇవ్వాలని, టాస్ వేసే విధానాన్ని రద్దు చేయాలని అనేక సూచనలు అందాయి. ముంబయిలో మే 28,29 తేదుల్లో జరిగే ఐసిసి క్రికెట్ కమిటీ సామవేశంలో టాస్ వేసే విధానం గురించి ప్రశ్నించి, చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాయిన్‌ను టాస్ చేసే విధానాన్ని రద్దు చేయాలా లేదా అన్నది చర్చించేందుకు ఐసిసి క్రికెట్ కమిటీ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయానికి సంబంధించి ప్యానెల్ సభ్యులందరికీ లేఖలు వెళ్లాయని సమాచారం. ఐసిసి క్రికెట్ కమిటీలో భారత మాజీ కెప్టెన్, కోచ్ అనీల్ కుంబ్లే, ఆండ్రూ స్ట్రాస్, మహేల జయవర్ధనే, రాహుల్ ద్రవిడ్, టిమ్ మే, న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్, అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో, ఐసిసి మ్యాచ్ రిఫరీల చీఫ్ రంజన్ మదుగల్లే, షాన్ పొల్లాక్, క్లేర్ కానర్ ఉన్నారు. ఒకవేళ కాయిన్‌ను టాస్ చేసే నియమం మారితే తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ కన్నా ముందే దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వచ్చే ఏడాది నుంచి 2021 వరకు జరగనున్నది.

Comments

comments