Home తాజా వార్తలు ఐసిసి వన్డే జట్టు కెప్టెన్‌గా కోహ్లి

ఐసిసి వన్డే జట్టు కెప్టెన్‌గా కోహ్లి

ICC-ODI1

దుబాయ్: 2016 వసంవత్సరంలో ఐసిసి వన్డే, టెస్టు జట్టు ఆటగాళ్ల పేర్లను ఐసిసి ప్రకటించింది. 2016లో టెస్టు, వన్డేల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ఎంపిక చేశారు. భారత్ నుంచి అశ్విన్ ఒక్కడే టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్నాడు. 2016 అత్యుత్తమ క్రికెటర్‌గా అశ్విన్ ఎంపికయ్యాడు. టెస్టు జట్టులో 12 మందిని ఎంపిక చేశారు. ఇంగ్లాండ్ క్రీడాకారులు నలుగురు, ఆస్ట్రేలియా ఆటగాళ్లు నలుగురు, భారత్, న్యూజిలాండ్, శ్రీలంక దక్షిణాఫ్రికా తరుపున ఒక్కొక్కరు చొప్పున స్థానం పొందారు. టెస్టు జట్టు కెప్టెన్‌గా కుక్ ఎంపికయ్యాడు.

ఐసిసి వన్డే జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ఎంపికయ్యాడు. వన్డే జట్టులోకి రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ స్థానం దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి నలుగురు, ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు, వెస్టిండీస్, ఇంగ్లాండ్ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేశారు.

ICC-test1