Home తాజా వార్తలు ఐసిసి టెస్టు రాంకింగ్స్: కోహ్లీ నెం.1

ఐసిసి టెస్టు రాంకింగ్స్: కోహ్లీ నెం.1

vrtదుబాయి: టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తన నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. శుక్రవారం ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌ ప్రకటించింది.  కోహ్లీ తన  కెరీర్‌లో అత్యధిక రేటింగ్‌ పాయింట్లు 937తో నంబర్‌ వన్‌ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు తర్వాత విరాట్‌ ప్రపంచంలో నంబర్‌ వన్‌‌ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌ తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లి శతకంతో రాణించిన విషయం తెలిసిందే. కోహ్లితో పాటు తన మొదటి టెస్టు మ్యాచ్ లోనే సెంచరీతో సంచలనం సృష్టించిన అరంగేట్రం ఓపెనర్ పృథ్వీ షా 72వ ర్యాంక్‌తో తన కెరీర్‌ని ప్రారంభించాడు. స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్ సన్, జో రూట్ లు వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచారు. ఇక వన్డే ర్యాంకింగ్స్‌లోనూ కోహ్లీ నెం.1 స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్ లో చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 52వ ర్యాంక్‌లో నిలిచాడు. విండీస్‌పై అజేయ శతకం సాధించడంతో పాటు నాలుగు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా 4వ స్థానంలో, ఆల్‌రౌండర్ జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. అగ్రస్థానంలో షకిబ్‌ అల్‌ హసన్‌ కొనసాగుతున్నాడు. పాక్‌తో జరిగిన టెస్టులో రాణించిన ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖావాజా తొలిసారి టాప్‌-10లో స్థానం దక్కించుకున్నాడు.
ఇక టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ జట్టు 115 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా (106), ఆస్ట్రేలియా (106), ఇంగ్లాండ్ (105), న్యూజిలాండ్ (102) వరుసగా టాప్-5లో నిలిచాయి.

ICC Rankings: India first place in test Rankings