Home తాజా వార్తలు టెస్టు ర్యాంకింగ్స్‌లో పంత్, షా దూకుడు..

టెస్టు ర్యాంకింగ్స్‌లో పంత్, షా దూకుడు..

shah

దుబాయ్‌:  సోమవారం ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఐసిసి  బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 935 రేటింగ్ పాయింట్లతో  టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, యువ సంచలనాలు పృథ్వీషా, రిషబ్‌ పంత్‌ లు విండీస్ తో జరిగిన 2వ టెస్టులోనూ రాణించి తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. ఈ ఇద్దరు ఆటలోనే కాకుండా ర్యాంకుల్లోనూ తమదైన శైలిలో దూకుడు కనబరుస్తున్నారు. తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో షా 13 స్థానాలకు ఎగబాకి, 60వ ర్యాంకు సాధించాడు. అరంగేట్రంలోనే శతకం బాదిన అతడు 73వ స్థానంతో ర్యాంకుల జాబితాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. మరోవైటు యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ కూడా ఏకంగా 23 స్థానాలు ఎగబాకి, 62వ ర్యాంకులో నిలిచాడు. విండీస్‌ సిరీస్‌ ఆరంభానికి ముందు పంత్ ది 111వ ర్యాంకు కావడం గమనార్హం. రెండు టెస్టుల్లోనూ రిషబ్‌ 92 పరుగుల వద్ద ఔట్ కావడంతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఉప్పల్‌లో 80 పరుగులు చేసిన అజింక్య రహానె నాలుగు స్థానాలు మెరుగై 18వ ర్యాంకు సాధించాడు. హైదరాబాద్ లో జరిగిన 2వ టెస్టులో పది వికెట్లతో చెలరేగి చరిత్ర సృష్టించిన ఉమేశ్‌ యాదవ్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 25వ స్థానంలో నిలిచాడు.

ICC Test Rankings released

Telangana