Home తాజా వార్తలు ఉమెన్ వరల్డ్ కప్: ఆసీస్ టార్గెట్ 227

ఉమెన్ వరల్డ్ కప్: ఆసీస్ టార్గెట్ 227

Rauth

లండన్: మహిళల ప్రపంచకప్ లో భాగంగా ఇవాళ భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుతో ఆడుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి జట్టు ముందు 227 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత బ్యాట్స్ వుమెన్లలో రౌత్ (106) శతకం నమోదు చేసింది. అలాగే కెప్టెన్ మిథాలీ రాజ్ 69 పరుగుల చేసి రాణించింది.

వీరిద్దరూ ఏకంగా 157 పరుగుల భాగస్వామ్యం సాధించడం విశేషం. ఈ ద్వయం నిష్ర్కమించిన తరువాత వచ్చిన వాళ్లు రాణించకపోవడంతో భారత్ జట్టు 226 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బౌలర్లలో పెర్రీ, హుట్ చెరో రెండు వికెట్లు తీయగా, గార్డ్నర్, బీమ్స్ తలో వికెట్ తీశారు. కాగా, ఈ మ్యాచ్ గెలిచిన జట్టు నేరుగా సెమీస్ కు వెళ్లే అవకాశం ఉండడంతో ఇరుజట్ల మధ్య పోరు రసవత్తారంగా ఉండనుంది.

ICC Women’s World Cup: Australia Women v India Women at Bristol.