Home తాజా వార్తలు పార్క్ హయత్‌లో ఐసిసిఎస్‌ఆర్‌సి సమావేశం

పార్క్ హయత్‌లో ఐసిసిఎస్‌ఆర్‌సి సమావేశం

Hyderabad : ICCSRC Meeting in Park Hayat

హైదరాబాద్ : పార్క్ హయత్‌లో ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సదరన్ రీజియన్ కౌన్సిల్ (ఐసిసిఎస్‌ఆర్‌సి) సమావేశం గురువారం జరిగింది. ఐసిసిఎస్‌ఆర్‌సి చైర్మన్‌గా తిక్కవరపు రాజీవ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశానికి తెలంగాణ మంత్రి కెటిఆర్ హాజరై మాట్లాడారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఉత్పత్తి రంగంలో జర్మనీని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణాభివృద్ధి కోసం ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. నాలుగేళ్ల తమ పాలనలో తెలంగాణళో ఎంతో అభివృద్ధి సాధించామని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలకు పదిహేను రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. మూతబడిన పరిశ్రమలను పునరుద్ధరిస్తున్నామని ఆయన తెలిపారు.

ICCSRC Meeting in Park Hayat