Search
Monday 24 September 2018
  • :
  • :

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు…

famly-image

కుమురం భీం ఆసిఫాబాద్:  ఆసిఫాబాద్ మండంలం లోని రాజూర గ్రామంలో ఐసిడిఎస్ అధికారులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. రాజూర గ్రామానికి చెందిన 17 సంవత్సరాల బాలికకు ఏప్రిల్ 22న లగ్గాం గ్రామానికి చెందిన యువకుడితో వివాహం చేయడానికి నిశ్చయించారు. విషయం తెలుసుకున్న ఐసిడిఎస్ పిడి సావిత్రి పోలీసులతో కలిసి బాలిక ఇంటికి వెళ్లి పెళ్లిని అడ్డుకున్నారు. బాలికకు 18 ఏండ్లు నిండిన అనంతరం వివాహం జరిపించాలని ఆమె తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఒప్పించారు.

Comments

comments