Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఐస్‌క్రీమ్ పండుగ

Ice-Cream-Day

అమెరికాలో జూలై నెలంతా ఐస్‌క్రీం పండుగ చేసుకుంటారు.  ప్రతి సంవత్సరం జూలై మూడో ఆదివారం జాతీయ ఐస్‌క్రీం దినోత్సవం జరుపు కుంటారు. ఈ నెలలో ప్రత్యేకంగా ఐస్‌క్రీం పార్టీలు చేసుకుం టారు. జూలై 1984 లో అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఈ హిమీక్రీముల ఉత్సవాన్ని మొదలుపెట్టాడట.  అలా సరదాగా మొదలై ఉపాధి కోసం ఏటా ఈ పండుగ కొనసాగుతోంది. వెయ్యికి పైగానే ఐస్‌క్రీము ఫ్లేవర్లున్నాయి. పండ్ల రుచుల్లోనే కాకుండా కూరగాయలు, మాంసాహార రుచుల్లో చేసినవి కూడా దొరుకుతాయట. అల్పాహారంతోపాటు ఐస్‌క్రీమ్‌ను కూడా జోడిస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుందని టోక్యోలోని క్యోరిన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడిం చారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఒకటి లాగించేయండి..

Comments

comments