Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

16 ఏళ్ల తర్వాత తొలిసారి నష్టాలు

ICICI Bank Net loss with 120 crores

క్యూ1లో ఐసిఐసిఐ బ్యాంక్ నికర నష్టం రూ.120 కోట్లు

న్యూఢిల్లీ: చాలా ఏళ్ల తర్వాత ప్రైవేటురంగ బ్యాం కింగ్ దిగ్గజం ఐసిఐసిఐ క్యూ1(ఏప్రిల్‌జూన్) ఫలితాల్లో తొలిసారి నష్టాలను నమోదు చేసింది. వీడియోకాన్ వివాదంలో ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఒ, ఎండి చందా కొచ్చర్‌పై ఆరోపణలు, మొం డి బకాయిల పెరిగి కారణంగా బ్యాంకు నష్టాలను చవి చూసింది. జూన్ 30 ముగింపునాటి ముగిసిన తొలి త్రైమాసికంలో బ్యాంక్ రూ.119.55 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గతేడాది తొలి త్రైమాసికంలో రూ.2, 049 కోట్ల లాభాలను ఆర్జించింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ నష్టాలను చవిచూసింది. అయితే బ్యాంక్ రూ.1,462 కోట్ల లాభాన్ని ఆర్జిస్తుందని విశ్లేషకులు అంచనా వేయగా, ఈసారి ఎవరూ ఊహించని విధంగా విరుద్ధమైన ఫలితాలను ఇచ్చింది. బ్యాంక్ స్థూల ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) రూ. 43,147.64 కోట్ల నుంచి రూ. 53,464.94 కోట్లకు పెరిగాయి. బ్యాంకు మొండి బకాయిలు గతేడాది జూన్‌లో 7.99శాతం ఉండగా.. ఈ ఏడాది 8.81శాతం నమోదైంది. అత్యవసర నిధి(ప్రొవిజనింగ్ అండ్ కాంటిజెన్సిస్) కింద బ్యాంకు వద్ద గతేడాది రూ.2,608. 74కోట్లు ఉండగా, ఈసారి రూ.5,971.29 కోట్లు ఉన్నాయి. ఇక ఐసిఐసిఐ మొత్తం ఆదాయం రూ.18,574.17 కోట్లు గా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు ఆదాయం రూ.16, 847.04 కోట్లుగా ఉంది. ఏకీకృత నికరలాభం గతేడాది రూ.2, 604.73కోట్లు ఉండగా.. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో రూ.4.93కోట్లు మాత్రమే ఉంది. దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఫలితాలకు సిఇఒ చందా కొచ్చర్ హాజరుకాలేదు. వీడియోకాన్ వివాదంపై దర్యాప్తు నేపథ్యంలో కొచ్చర్‌ను వార్షిక సెలవుపై పంపిన విషయం తెలిసిందే.

Comments

comments