Home తాజా వార్తలు ఓటర్ స్లిప్‌తో పాటు గుర్తింపు కార్డు ఉండాలి : కలెక్టర్ శ్రీధర్

ఓటర్ స్లిప్‌తో పాటు గుర్తింపు కార్డు ఉండాలి : కలెక్టర్ శ్రీధర్

ID Cardనాగర్‌కర్నూల్ : ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలలో ప్రజలు తమ ఓటును వినియోగించుకునేందుకు ఓటర్ స్లిప్‌తో పాటు తప్పనిసరిగా ఫొటో ఓటరు కార్డు లేని, భారత ఎన్నికల సంఘం 12 రకాల ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన ఫొటో ఐడెంటీ కార్డులలో ఏదో ఒకటి పోలింగ్ అధికారికి చూపించి ఓటును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్  శ్రీధర్ తెలిపారు.

12 రకాల ఓటర్ కార్డుల వివరాలు : ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, కేంద్ర, రాష్ట్ర సంస్థ చే జారీ చేయబడిన గుర్తింపు కార్డు ,పాస్‌పోర్టు, కారిమక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య భద్రతాకార్డు, ఎంపి, ఎమ్మెల్యేలకు జారీ చేసిన కార్డు, మహ్మాత్మ ఉపాధి పథకం ద్వారా జారీ చేయబడిన కార్డు ఫోటో తో కూడిన పెన్షన్ పత్రం , స్మార్ట్‌కార్డు, ఫోటో తో కూడిన బ్యాంక్‌పాస్‌బుక్ , డ్రైవింగ్ లైసెన్స్, ఫోటో ఓటరు గుర్తింపుకార్డు ఈ 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒక కార్డును తప్పనిసరిగా పోలింగ్ అధికారులకు చూపించి తమ ఓటు ను వినియోగించుకోవాలని కలెక్టర్  శ్రీధర్ సూచించారు.

ID Card With Voter Slip For Vote Cast