Search
Friday 16 November 2018
  • :
  • :

మూడింతలు పెరిగిన ‘ఐడియా’ నష్టాలు

idea

న్యూఢిల్లీ: మార్చి ముగింపు నాటి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో ఐడియా సెల్యులార్ నష్టాలు మూడింతలు పెరిగాయి. సంస్థ నష్టం రూ.962 కోట్లు నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో ఐడియా నష్టం రూ.327 కోట్లుగా ఉంది. ఆదిత్య బిర్లాకు చెందిన ఐడియా సెల్యులార్ నష్టాలు గతేడాది కంటే ఈ ఏడాది మరింతగా పెరిగాయి. ఆపరేటింగ్ రెవెన్యూ రూ. 6,137 కోట్లతో 24 శాతం క్షీణించింది. గతేడాది ఇది రూ.8,194.50 కోట్లగా ఉంది. ఏడాది వ్యాప్తంగా కంపెనీ నష్టాలు రూ.4168.20 కోట్లగా ఉన్నట్టు ఐడియా ప్రకటించింది. ఐడియా ఆర్పూ(యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్) కూడా రూ.114 నుంచి రూ.105 తగ్గింది. ఇతర టెలికాం కంపెనీల ఆర్పూలతో పోలిస్తే ఐడియాదే తక్కువగా ఉంది. జియో ఆర్పూ 137 రూపాయలు ఉండగా, భారతీ ఎయిర్‌టెల్ ఆర్పూ రూ.116లుగా ఉంది. ఐడియా సెల్యులార్ ఇలా నష్టాలు ప్రకటించడం వరుసగా ఇది ఆరోసారి కావడం గమనార్హం. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎంటిసి సెటిల్‌మెంట్ రేటు భారీగా తగ్గడం, ఎక్కువ ఆర్పూ అందించే కన్జ్యూమర్లు, తక్కువ ధర కలిగిన అపరిమిత వాయిస్ డేటా ప్లాన్ల వైపు తరలివెళ్లడం ఐడియా స్థూల రెవెన్యూలపై ప్రభావం చూపినట్టు కంపెనీ ప్రకటించింది. అలాగే, టెలికాం మార్కెట్‌లో నెలకొన్న తీవ్ర పోటీ కారణంగా ఐడియా, వొడాఫోన్‌లు జత కట్టబోతున్నాయి. శుక్రవారం నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో ఐడియా షేరు విలువ 0.51 శాతం పెరిగి రూ.68.75 వద్ద స్థిరపడింది.

Comments

comments