Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఐడియాలో కొత్త ఆఫర్లు ఇవే…

idea

ముంబయి:  ప్రముఖ టెలికాం సంస్థ ఐడియా తన నూతన ప్రీపెయిడ్ ఆఫర్లను బుధవారం ప్రకటించింది. రూ.227తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వాలిడిటీలో అన్‌లిమిటెడ్‌ ఫోన్ కాల్స్ తో పాటు అన్‌లిమిటెడ్‌ ఫ్రీ డయలర్ టోన్లు, రోజుకు 1.4 జిబి 3జి లేక 2జి డేటా, 100 ఎస్‌ఎంస్‌లను తన కస్టమర్లకు అందిస్తోంది. 28 రోజుల్లో మొత్తం 39.4 జిబి డేటాను ఇస్తోంది. ఈ ప్లానులో ఫ్రీగా మిస్డ్ కాల్ అలర్ట్‌లను కూడా ఐడియా అందిస్తోంది. మరో పక్క అన్‌లిమిటెడ్‌ ధమాకా ఆఫర్‌ పేరిటా రూ.199 రీచార్జ్‌ ప్లాన్లతో కలిపి ఎంపిక చేసుకున్న కస్టమర్లకు క్యాష్‌బ్యాక్‌ వంటి పలు ఆఫర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. టెలికాం మార్కెట్‌లో రిలయన్స్‌ జియో ఇస్తున్న పోటీకి దీటుగా ఇతర కంపెనీలు కూడా ఆఫర్లను కురిపిస్తున్నాయి.

Comments

comments