Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

రూ.595 ప్లాన్‌ను లాంచ్ చేసిన ఐడియా…

idaa

ముంబయి: ప్రముఖ టెలికాం సంస్థ ఐడియా సెల్యులార్ రూ.595 కి ఓ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకునే ఐడియా వినియోగదారులకు 10 జిబి ఫిక్స్‌డ్ మొబైల్ డేటా లభిస్తోంది. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఈ ప్లాన్ లో వస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 112 రోజులుగా నిర్ణయిస్తున్నట్టు ఐడియా వెల్లడించారు. కాగా ఈ ప్లాన్‌లో కస్టమర్లు గరిష్టంగా రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాల వాయిస్ కాల్స్‌ను చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఈ ప్లాన్ రెండు తెలుగు రాష్ర్టాలతో సహా అస్సాం, బీహార్, హర్యానా, నార్త్ ఈస్ట్, రాజస్థాన్, యుపి ఈస్ట్ సర్కిల్స్‌లోని కస్టమర్లకు అందుబాటులో ఉందని సంస్థ వెల్లడించింది.

Comments

comments