Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

విటమిన్ ఎ లోపం గుర్తించండిలా..

vitamin-A

మనం తీసుకునే ఆహారం ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అందం, ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్ ఎ శక్తివంతమైన ఆంటాక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. మనం రోజూ తీసుకునే ఆహారం ద్వారా ఇది శరీరానికి అందుతుంది. విటమిన్ ఎ లోపం వల్ల ఏర్పడే లక్షణాలను త్వరగా గుర్తించి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

విటమిన్ ఎ లోపం వల్ల ఏర్పడే లక్షణాలు –

* చర్మ సంబంధ ఇన్పెక్షన్లకు తరచూ గురవడం, * యాక్నే(మొటిమలు),చర్మం పొడిబారి పోలుసుల్లా రాలి పోవడం. * గొంతు ఇన్ఫెక్షన్లు, నోటిలో పుండ్లు రావడం. * తలలో చుండ్రు, పొడిబారిని వెంట్రుకలు. * ఈ లోపం ఎక్కువగా ఉంటే రేచీకటి రావడానికి కారణ మవుతుంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇండియా ప్రకారం విటమిన్ ఎ అవసరం ఎవరికి ఎంత – పురుషులకు : 900 మైక్రోగ్రాములు రోజుకు.

మహిళలకు : 700 మైక్రోగ్రాములు రోజుకు. గర్భవతులకు : 750-770 మైక్రోగ్రాములు రోజుకు. పాలిచ్చే తల్లులకు : 1300 మైక్రోగ్రాములు. ఎ విటమిన్ ఎలా పొందుతాము, వేటిల్లో దొరుకుతుంది – ఈ పోషకాన్ని రెండు రకాలుగా పొం దవచ్చు. మొదటిది రెటినాల్ : పాలు, గుడ్లు, లివర్ వంటి వాటినుండి శరీరం నేరుగా విటమిన్ ఎ ను గ్రహిస్తుంది. రెండోది ప్రొవిటమిన్ ఎ లేదా కెరోటినాయిడ్స్ : ఇవి పండ్లు, కూరగాయల్లో లభిస్తుంది. శరీరంలో జరిగే జీవక్రియల వల్ల ఇవి రెటినాల్స్ గా మారతాయి.

దీన్లో బీటా కెరోటిన్ అనేది ముఖ్యమైన కెరోటినాయిడ్, ఇది మనం తీసుకున్న ఆహారం ఎ విటమిన్ గా మార్పు చెందడంలో శక్తివంతమైన పాత్ర పోషిస్తుంది. పసుపు, నారింజ రంగు పండ్లలో (మామిడి, బొప్పాయి, ఆప్రికాట్ వంటి పండ్లలో, క్యారెట్, పాలకూర, లెటస్, టమాట, కందగడ్డ(గన్సుగడ్డ), బ్రకోలి వంటి కూరగాయల్లో ఎక్కువగా బీటాకెరోటిన్ లభిస్తుంది.

Comments

comments