Home తాజా వార్తలు వినియోగదారులకు ఐడియా షాక్

వినియోగదారులకు ఐడియా షాక్

idea2హైదరాబాద్: నగరంలో ఐడియా నెట్‌వర్క్ వినియోగదారులు సిగ్నల్స్ సమస్యతో సతమతమవుతున్నారు. ఒక్కోసారి కనీసం బీప్ కూడా అవకుండానే ఫోన్ కాల్స్ తొలి డయల్‌కే కట్ అయిపోతున్నాయి. దీంతో తమ ఫోన్ల ప్రాబ్లమా లేక నెట్‌వర్క్ సమస్య అని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మొత్తం నగరమంతటా కూడా ఇవాళ ఉదయం నుంచి ఇదే సమస్య ఉంది. ఇప్పటికే పలువురు అసలు తమ ఐడియా నెట్‌వర్క్ పనిచేయడం లేదని, సిగ్నల్స్ రావడం లేదని చెబుతున్నారు. దీనిపై ఇప్పటి వరకు ఐడియా నెట్‌వర్క్ అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.