Home రాష్ట్ర వార్తలు లోపముంటే చెప్పండి తప్పుకుంటా

లోపముంటే చెప్పండి తప్పుకుంటా

janareddyహైదరాబాద్:  తనలో ఏదైనా లోపమనిపిస్తే చెప్పం డని, వెంటనే తన పదవి నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్ శాసనసభా పక్ష (సిఎల్‌పి) నాయకుడు కె.జానారెడ్డి అన్నారు. ఇటీవల కొందరు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరడం, మరికొంత మంది కూడా అదే బాటలో ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో గురువారం సిఎల్‌పి కార్యాలయంలో కాంగ్రెస్ ఎంఎల్‌ఏలతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీకి కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టి.జీవన్‌రెడ్డి, జె.గీతారెడ్డి, డి.కె.అరుణ, జి.చిన్నారెడ్డి,  కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, పద్మావతి, భాస్కర్ రావు, సంపత్‌కుమార్ హాజరవగా, మల్లు భట్టి విక్రమార్క పాలేరు ఉప ఎన్నికల నేపథ్యంలో హాజరుకాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకా రం ఈ సమావేశంలో జానారెడ్డి పార్టీ నుంచి ఫిరాయింపులపై  ఆవే దన వ్యక్తం చేశారు. పార్టీని వీడుతున్నారని తెలిసిన వెంటనే ఎంఎల్‌ఎ లను నిలవరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నానని, అయితే స్వప్రయోజనాల కోసమే పార్టీని వీడుతుండడం దురదృష్టకరమ న్నారు. ఎంఎల్‌ఎలను ఆపడంలో తన లోపమేమైనా ఉందని భావిస్తే తక్షణమే సిఎల్‌పి నేత పదవి నుంచి తప్పుకుంటానని చెప్పినట్లు తెలిసింది. అలాగే ఇటీవల కొన్ని పత్రికల్లో తానే పార్టీని వీడుతున్నట్లు వార్తలు రావడం, దానిపై పిసిసి లేదా ఎంఎల్‌ఏలు ఖండించకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీని పై ఎంఎల్‌ఏలు స్పందిస్తూ సిఎల్‌పి నాయకత్వంపై తమకు ఎలాంటి అవిశ్వా సం లేదన్నారు. అధికార పార్టీనే ప్రలోభపరుస్తుండడంతో ఎంఎల్‌ఏలు పార్టీ వీడుతున్నారని చెప్పారు. ఇందులో నాయకత్వం తప్పేమీ లేదన్నట్లు సమాచా రం. ఈ సందర్భంగా ఇంకా ఎవరైనా పార్టీని వీడాలనుకుంటే చెప్పమని జానా రెడ్డి కోరగా, తమకెవరికీ అలాంటి ఆలోచనే లేదని స్పష్టం చేశారు.
మమ్మల్నీ రమ్మన్నారు: వంశీ, సంపత్
మక్తల్ ఎంఎల్‌ఎ చిట్టెం రామ్మోహన్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరేందుకు కొద్ది రోజుల ముందు తనను, సంపత్‌కుమార్‌ను కలిసారని కల్వకుర్తి ఎంఎల్‌ఏ వంశీచంద్ రెడ్డి సమావేశంలో అన్నారు. తామిద్దరిని కూడా టిఆర్‌ఎస్‌లోకి రావాలని కోరారు. అందుకు సిద్ధమైతే తాను ఆ పార్టీతో మాట్లాడతానంటే, తాము గట్టి గా తిరస్కరించామని వంశీ తెలిపారు. అయితే, ఈ విషయాన్ని తనకు ఆరోజే ఎందుకు తెలియజేయలేదని వంశీచంద్, సంపత్‌లను రామ్మోహన్‌రెడ్డి సోదరి, గద్వాల ఎంఎల్‌ఏ డి.కె.అరుణ గట్టిగా ప్రశ్నించారు. తన సోదరుడు పార్టీని వీడుతున్నట్లు తెలిసిన వెంటనే తాను మాట్లాడానని, అలాగే పిసిసి, సిఎల్‌పి నేతల దృష్టికి కూడా తీసుకెళ్ళానని చెప్పారు.
సమావేశం నుండి వెళ్ళిపోయిన కోమటిరెడ్డి
సభ ప్రారంభమవగానే ఎంఎల్‌ఏ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డిసిసి అధ్యక్షుడు ఆరు నెలలైనా ఇంత వరకు మీటింగ్ పెట్టలేదని, ఇంకా మరికొన్ని అంశాలను ప్రస్తావిస్తూ సమావేశం నుండి వెళ్ళిపోయారు.ఇదిలా ఉండగా, శాసనమండలి కాంగ్రెస్ పక్ష నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సమావేశం ప్రారంభమవగానే లోపలికి వెళ్ళారు. సిఎల్‌పి సమావేశం పెట్టి ఎంఎల్‌సిలకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. దానికి ఎంఎల్‌ఏలు స్పందిస్తూ తాము కేవలం కాంగ్రెస్ ఎంఎల్‌ఏల గెట్‌టు గెదర్ మాత్రమే పెట్టామని, ఇదేమి సమావేశం కాదన్నారు. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు నడుస్తుండడంతో సిఎల్‌పిలో సభ్యులుగా ఉండే ఎంపిలు అక్కడే ఉండాల్సి ఉందని, అందుకే సిఎల్‌పి సమావేశం పెట్టలేదనడంతో బైటికి వెళ్ళబోయారు. పర్వాలేదు మీరు కూడా కూర్చోవచ్చని చెప్పడం , ఇంతో మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ రావడంతో వారిరువురు ఎంఎల్‌ఏల సమావేశంలో కాసేపు కూర్చొని వెళ్ళిపోయారు.
పాలేరు ఉప ఎన్నిక ఖర్చుకు నెల జీతం విరాళం : సిఎల్‌పి
పాలేరు ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి సతీమణి కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డికి ఎన్నికల ప్రచార ఖర్చు నిమిత్తం నెల జీతం విరాళంగా ఇవ్వాలని కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు, ఎంపిలు, ఎంఎల్‌సిలు నిర్ణయించారు. సిఎ ల్‌పి కార్యాలయంలో గురువారం జరిగిన కాంగ్రెస్ ఎంఎల్‌ఏల సమావేశం అ నంతరం సిఎల్‌పి కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి వివరాలను మీడియాకు తెలి యజేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారానికి నెల జీతం విరాళంగా ఇచ్చేందుకు ఎంపిలు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలు అంగీకరించారని తెలిపారు.
కరువు ఉంటే ప్లీనరీలో 50 రకాల వంటలా?
ఒకవైపు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే ఖమ్మంలో జరిగిన ప్లీనరీ లో 50 రకాల వంటకాలతో టిఆర్‌ఎస్ నాయకులు విందులు చేసుకున్నారని రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజలను ఓదార్చాల్సిన సమయంలో కనీసం కరు వు ప్రస్తావనే ప్లీనరీలో లేకపోవడం శోచనీయమన్నారు. కరువు సహాయ చర్య లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. పార్టీ ఫిరా యింపులకు సంబంధించి న్యాయస్థానాల్లో పోరాటాన్ని మరింత తీవ్రం చేస్తా మని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మే 9న ఎంఎల్‌ఏ సంపత్‌కుమార్ దీక్ష