Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

పనులు చేయడం ఇష్టంలేకుంటే వెళ్లిపోండి

Arigela-Nageshwar-Rao

మనతెలంగాణ/వాంకిడి: పనుల నిర్వాహణపై శ్రద్ద లేకుంటే సెలవులు పెట్టి ఇంటికి వెళ్ళిపోవాలని ఈజిఎస్ ఎపిఓ మల్లయ్య పై జెడ్పిటిసి అరిగేలా నాగేశ్వర్‌రావు, కిరిడి ఎంపిటిసి శుక్రవరాం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి దుర్గం ఆర్తిక అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. హారితహారం మొక్కలు నాటి సంవత్సర కాలం పూర్తి కావస్తున్న పనులు చేసిన కూలీలకు బిల్లులు చెల్లించే విషయంలో  ఎందుకు జాప్యం చేస్తున్నారని భీమన సర్పంచ్ ప్రకాష్, ఎపిఓ మల్లయ్యను నిలదీశారు. మొక్కలు పెంచండి. మరుగుదోడ్లను నిర్మించుకోవాలని అని చెప్పడం కాదు. పని చేసిన,నిర్మించుకున్న లబ్దిదారులను గుర్తించి వారికి డబ్బులు చెల్లించాలన్నారు. 2015-16 వార్షిక సంవత్సరంలో మండలంలో ఈజిఎస్ ద్వారా చేపట్టిన పనుల వివరాలను తెలుపాలని జెడ్పిటిసి, ఎపిఓ ను కొరగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఈజిఎస్ స్బింది పని తీరు పై అసహనం వ్యక్తం చేశారు.

పనితీరు మార్చుకోవాలని సూచించారు. కిరిడి పాఠశాలలో చేపట్టిన వంటషెడ్ నిర్మాణపనులు గత రెండుసంవత్సరాల నుండి అసంపూర్తిగా ఉన్నాయని,పనులు చేపట్టాలని చెప్పి న ఎవరు పట్టించుకోవడంలేదని ఎంఈఓ మను కుమార్‌ను ఎంపిటిసి సోమేశ్వర్ నిలదీశారు. పనులు నిర్వ హించాలని లేని పక్షంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామ న్నారు. కస్తూర్భా గురుకులంలో విద్యార్దులకు కాస్మోటిక్ చార్జీలు ఇవ్వడంలేదని,అందించేలా చర్యలు తీసుకోవాలని ఎంపిపి దుర్గం ఆర్తిక ఎంఈఓకు సూచించారు. అనంతరం వివిధ శాఖల అభివృద్ది పనులపై నామమాత్రంగా చర్చలు నిర్వ హించారు. సమావేశంలో ఎంపిడిఓ అర్జాన్ పవర్, జిల్లా మైనార్టీ అధికారి అహ్మాద్ ఉల్లాఖాన్ తదితరులున్నారు.

Comments

comments