Home లైఫ్ స్టైల్ పురుషులు ఇంటి పని చేస్తే నామోషీనా?

పురుషులు ఇంటి పని చేస్తే నామోషీనా?

If men do the work of house, Namosina

 

పూర్వపు రోజులలో స్త్రీలు ఇంటి పనులు, పిల్లల పెంపకం, కుటుంబ సభ్యుల అవసరం చూస్తూ ఇంటికే పరిమితమయ్యేవారు. పురుషులు ఉద్యోగం చేయడం, బయటపనులు చూడటం తమ బాధ్యతగా భావించేవారు. ఆ తర్వాత కాలంలో వచ్చిన మార్పువల్ల అమ్మాయిలు కూడా మగ పిల్లలతో సమానంగా ఉన్నత విద్యలు చదవడం ఆరంభించారు. తమ అర్హతకు తగిన ఉద్యోగాలు చేయడం ప్రారంభించారు. వెనుకటి రోజులలో చదువుకున్న యువతులు టీచర్లుగా లెక్చరర్లుగా, నర్సులుగా, రిసెప్సనిస్టులుగా ఉద్యోగాలకు ఎంపికయ్యేవారు.

భార్య పరిస్థితిని, ఆమె శ్రమనూ గుర్తించి, ఆమెకు తన వంతు సాయాన్ని అందించాలి భర్త. ఆమె తనకు ఆర్థికంగా సాయపడుతున్నట్లే, తాను ఆమెకు పనుల్లో సాయం పడటం అతని మంచితనానికీ మానవత్వానికీ, సంస్కారానికీ, ఔదార్యానికీ అద్దం పడుతుంది. భార్య ఉదయం పరుగులు తీస్తూ, పడుతూ లేస్తూ, పనులు చేస్తుంటే, భర్త పేపర్ పట్టుకుని కూర్చోవడం, ఆలస్యంగా నిద్ర లేచి తన పనులను భార్య మీద ఆధారపడటం వల్ల వారిద్దరి మధ్య కలహాలు, కలతలు ఏర్పడవచ్చు. ఫోన్‌లో మాట్లాడుతూ కాల క్షేపం చేయకూడదు. ముఖ్యంగా, ఉదయం సమయంలో భార్య పనుల్లో భర్త సాయపడటం వల్ల వారి దాంపత్యంలో ఏ పొరపొచ్చాలు లేకుండా అన్యోన్య దాంపత్యమవుతుంది.

ఆధునిక కాలంలో స్త్రీలు,పురుషులతో సమానంగా అన్ని రంగాలలోనూ ఉద్యోగాలు చేస్తూ తమ ఉద్యోగ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారు, తమ చదువుకు సార్థకత ఉండాలనో, పెరిగిన ఖర్చులు,ఆర్థిక సమస్య ఏర్పడకుండా చేసుకోవటానికో, ఆకాశానికి అంటుతున్న ధరలవల్ల, ఇంత చదువు చదివి గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లోనే ఉండాలా? అన్న అభిప్రాయంతోనో, పిల్లల భవిష్యత్తు కోసమో, ఈనాడు స్త్రీలు ఉద్యోగాలు చేయటానికి ముందుకొచ్చారు. అయితే, ఈనాడు ఉమ్మడి కుటుంబాలు లేవు.

ఉద్యోగ రీత్యా కావచ్చు, మరింకే కారణం వల్లనైతేనేమి, సమష్టి కుటుంబాలు చీలిపోయి, ఒంటరి కాపురాలే ఉంటున్నాయి. అందువల్ల, ఇంట్లో మరో ఆడతోడు లేకపోవడం వల్ల,స్త్రీలు ఉద్యోగంచేయడంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా, పసిపిల్లలను, చిన్న పిల్లలను ఇంట్లో ఉంచి వెళ్ళాల్సి ఉంటుంది. పిల్లలను చూసుకోవడం సమస్యగా తయారయింది. స్త్రీలు ఉద్యోగానికి వెళ్లడం ఆరంభించి, చిన్నారులను చూసుకునే విషయంలో సమస్య ఎదురవటంతో, పిల్లలను చూసుకోవడానికి పిల్లలను సంరక్షణాలయాలు (బేబీకేర్ సెంటర్), (క్రెష్) వచ్చాయి. వాటిలో పిల్లలను చేర్పించి ఆలుమగలిద్దరూ నిశ్చింతగా ఆఫీసుకు వెళ్తున్నారు.

పిల్లల ఆటపాటలు, ముద్దు ముచ్చట్లు తాను చూసుకోలేకపోతున్నానన్న కొరతతో పాటు, పిల్లలకు తన ప్రేమను అందించకలేక పోతున్నానే అన్న మనోవేదన తల్లికి తప్పదు. అంతేకాదు, పిల్లలకు అనారోగ్యం కలిగి,అక్కడ వదిలినప్పుడు, తాను దగ్గరుండి బిడ్డను చూసుకోలేక పోతున్నాననే అన్న బాధ కలుగుతుంది తల్లికి. పిల్లలు ఎదిగి కొంత వయస్సు వచ్చే వరకూ ఈ అశాంతి తల్లి వెన్నంటే ఉంటుంది. ప్రతి ఉద్యోగిని పిల్లల విషయంలో అనుభవించే బాధే ఇది. ఆలుమగలిద్దరూ ఉద్యోగస్తులయినప్పుడు, ఉద్యోగిని ఇంటా,బయటా,పిల్లలను చూసుకోవడంలో పురుషుని కంటే అధికంగా శ్రమించవలసి వస్తోంది.

భార్య ఉద్యోగిని అయినప్పడు, తన భర్త సహచరి కష్టాన్ని, శ్రమను అర్థం చేసుకోవాలి. ‘ఉద్యోగం పురుషలక్షణం ’అన్న సామెత పాతబడిపోయింది. ఆర్థికంగా తనకు సాయపడుతున్న భార్యకు తాను అండగా నిలవాలి భర్త, భార్యను ఉద్యోగానికి పంపడం సంస్కారమనిపించుకోవడం కాదు, భార్య శ్రేయస్సును గుర్తించి ఆమెకు సాయపడటంలోనే భర్త సంస్కారం తెలుస్తుంది. భార్య తన కంటే ఎక్కువ కష్టపడుతోందని గ్రహించి, ఇంటి పనుల్లోకానీ, పిల్లల పనుల్లో,కానీ భార్యకు కొంత సహాయం,

సహకారాన్ని అందించాలి. తాను పురుషుడిని అన్న ఇగోను వదిలెయ్యాలి. భార్యకు ఇంటి పనుల్లో, వంట పనుల్లో సాయం అందించటాన్ని నామోషీగా భావించ కూడదు. ఆర్థికంగా తన భర్తకు సహకరిస్త్తూ, తన చేయూతనందిస్తున్న భార్యకు ఇంటి పనుల్లో, వంట పనుల్లో సాయ పడటంలో తప్పు లేదు. భర్త చేసే చిన్న చిన్న పనులే ఆమెకు భర్త మీద ప్రేమను, గౌరవాన్ని పెంచుతాయి. నిజానికి, వంట పనిచేయడంలో మగవాడు నామోషీగా భావించవలసిన అవసరమే లేదు. ప్రాచీన కాలం నుంచే పురుషులు వంటల్లో ఆరితేరారని పురాణాలు వెల్లడించాయి. నలభీమ పాకం అన్నారు.

నలుడు,భీముడు పురుషులు, పాకం అంటే వంట అని అర్థం. వారిద్దరూ పాకశాస్త్ర ప్రవీణులని తెలుస్తుంది. ఈరోజుల్లో కూడా పురుషులు వంటలు చేస్తున్నారు. హోటల్స్‌లో వండేది పురుషులే, రెస్టారెంట్స్‌లో కానీ, ధాబాల్లో కానీ మిఠాయి దుకాణాల్లో మిఠాయిలు తయారు చేసేవారు, బేకరీల్లో, టిఫెన్ సెంటర్లల్లో, గప్‌చుప్ బండ్ల వద్ద,మిర్చీ,బజ్జీలు, పునుకులు, సమోసాలు, వడలు, మైసూర్‌బజ్జీలు అమ్మే బండ్లల్లో పురుషులే, ఆ పదార్థాలను తయారుచేసి విక్రయించేదీ పురుషులే, అందువల్ల, పాకశాస్త్రంలో పురుషులూ తమ ప్రావీణ్యతను ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు, పెద్ద పెద్ద ఫంక్షన్లు, శుభకార్యాల సమయంలో పురుషులయిన వంట వాళ్లే వంటను వండుతారా! తమకు సహాయం చేసేందుకు స్త్రీలను నియమిస్తున్నారు. వంటపని ఆడవాళ్లదే అని భావించవలసిన పని లేదు. అందువల్ల పురుషులు స్త్రీలకు వంటల్లో సాయం చేయడాన్ని నామోషీగానూ, చిన్నతనంగానూ భావించవలసిన పనిలేదు.

‘వంటపని, ఇంటిపని’ భార్యదే అని పురుషుడు విశ్రాంతిగా, తీరిగ్గా కాలక్షేపం చేయడం, ఈరోజుల్లో భావ్యం కాదు. పురుషుడు కూడా కొన్ని పనుల్లో సాయపడడం కొన్ని కుటుంబాల్లో జరుగుతూనే ఉంది. వాషింగ్ మిషన్‌లో బట్టలు వేయడం, ఆరెయ్యడం, పిల్లల పనులను చేయడం, వారిని పాఠశాలకు తయారు చేయడం లాంటివి కొందరు పురుషులు చేస్తున్నారు. భార్య ఉద్యోగిని అయితే, ఉదయం వేళలో స్త్రీలకు పనులు అధికంగా ఉంటాయి. సమయం తక్కువగా ఉండడం వల్ల శారీరక అలసట మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. అటువంటి సమయంలో,భర్త నుంచి సాయం పొందటం భార్యకు ఎంతో అవసరమవుతుంది.

ఇంట్లోనే ఉండే గృహిణి అయితే పనులను విభజించుకొని, ముఖ్యమయిన పనులను సరైన సమయానికి చేసేసి, పిల్లలు,భర్త వెళ్లిన తర్వాత మిగిలిన పనులను చేసుకుంటుంది. కానీ ఉద్యోగినికి ఆ అవకాశం ఉండదు. పనులన్నింటినీ ఆదరాబాదరాగా, హైరానపడుతూ చేసుకొని, తినీ తినకా ఉద్యోగానికి వెళ్లవలసి వస్తుంది. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే, నడుం బిగించి తిరిగి పనులలో చొరపడవలసి ఉంటుంది. పిల్లల చేత హోంవర్కును చేయించడం, రాత్రికి తిరిగి వంటపని, ఉదయం వంటకు కావలసిన కూరలను తరిగి పెట్టుకోవడం లాంటి పనులను చేయాల్సి వస్తుంది, ఉద్యోగినికి విశ్రాంతి కరువవుతుంది. భార్య పరిస్థితిని, ఆమె శ్రమనూ గుర్తించి, ఆమెకు తన వంతు సాయాన్ని అందించాలి భర్త.

ఆమె తనకు ఆర్థికంగా సాయపడుతున్నట్లే, తాను ఆమెకు పనుల్లో సాయం పడటం అతని మంచితనానికీ మానవత్వానికీ, సంస్కారానికీ, ఔదార్యానికీ అద్దం పడుతుంది. భార్య ఉదయం పరుగులు తీస్తూ, పడుతూ లేస్తూ, పనులు చేస్తుంటే, భర్త పేపర్ పట్టుకుని కూర్చోవడం, ఆలస్యంగా నిద్ర లేచి తన పనులను భార్య మీద ఆధారపడటం వల్ల వారిద్దరి మధ్య కలహాలు, కలతలు ఏర్పడవచ్చు. ఫోన్‌లో మాట్లాడుతూ కాల క్షేపం చేయకూడదు. ముఖ్యంగా, ఉదయం సమయంలో భార్య పనుల్లో భర్త సాయపడటం వల్ల వారి దాంపత్యంలో ఏ పొరపొచ్చాలు లేకుండా అన్యోన్య దాంపత్యమవుతుంది.

తన కష్టాన్ని గుర్తించి, తన పనుల్లో సాయపడుతూ, తనకు కొంత విశ్రాంతిని కలిగించే భర్త పట్ల భార్యకు ప్రేమ రెట్టింపవుతుంది. వారి సంసారం నిత్య నూతనంగా ఉంటుంది. పిల్లలు కూడా చిన్న చిన్న పనులు చేయడం వల్ల ఆసక్తి చూపుతారు. వారి వయస్సుకు తగిన పనులను, వారికి అప్పచెప్తే, వారు ఉత్సాహంగా, చురుకుగా వాటిని చేస్తారు. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు భర్త స్నేహితులతో వచ్చి మాట్లాడుతుంటే భర్త పనుల్లో తనకు సాయపడటం లేదని సణగ కూడదు. ప్రతి రోజూ తనకు పనుల్లో సాయం చేసే భర్త ఔదార్యాన్ని గుర్తించాలి.

                                                                                               – కె. నిర్మల

If men do the work of house, Namosina

Telangana Latest News