Home రాష్ట్ర వార్తలు అభివృద్ధి జరిగితే రైతు ఆత్మహత్యలెందుకు?

అభివృద్ధి జరిగితే రైతు ఆత్మహత్యలెందుకు?

 టివివి సదస్సులో వక్తల ధ్వజం

                     Kodanda-Ram

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నట్లు ఆర్థిక వృద్ధి (జిడిపి) పెరిగి అభివృద్ధిలో దూసుకుపోతే, దేశంలో రైతుల ఆత్మ హత్యలు ఎందుకు జరుగుతున్నాయని కిసాన్ ఏక్తా కన్వీనర్ డా. దేవేంద్ర శర్మ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3030 రైతు ఆత్మ హత్యలు జరిగితే, ఇందులో కెసిఆర్ సొంత నియోజకర్గంలోనే 108 మంది ఉన్నారని, అయినా సిఎం తన ప్రగతి భవన్‌లోనే ప్రశాంతంగా గడుపుతున్నారని విమ ర్శించారు. జిడిపి పెరుగుదలకు, క్షేత్ర స్థాయి అభివృద్ధికి సంబంధమే లేదని, జిడిపి వృద్ధి అనేది కేవలం చేతిలో జరిగే పైసల మార్పిడి మాత్రమేనని, ఈ విధానం పెద్ద లోపభూయిష్టమని వ్యాఖ్యానించారు.

రైతులకు కనీసం రూ.18వేల ఆదాయం వచ్చేలా రాబోయే 2019 ఎన్నికల్లో “రైతు ఆదాయ కమిషన్‌” ప్రధాన ఏజెండాగా మరాలన్నారు. వ్యవసాయ రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొ. జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక (టివివి) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఆదివారం “కల్లోల దృశ్యం-వ్యవసాయ రంగం” అనే అంశంపై దేవేంద్ర శర్మ స్మారకోపన్యాసం చేశారు. టివివి రూపొందించిన “ కల్లోల దృశ్యం-వ్యవసాయం రంగం” అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక వ్యవసాయ విధానాన్ని రూపొందించడంపై దృష్టి పెట్టని సిఎం కెసిఆర్, తన అధికార భవన నిర్మాణంపై మాత్రం దృష్టి సారించారని ఎద్దేవా చేశారు.

మూడేళ్లకాలంలో దేశ వ్యాప్తంగా 3.18 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతకుమారి కమిటీ నివేదక ప్రకారం దేశ వ్యాప్తంగా కేవలం 6 శాతం మంది మాత్రమే కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)ను పొందుతున్నారన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వానికి, ముందు రైతులకు వచ్చే ప్రస్తుత ఆదాయం తెలుసా అని ప్రశ్నించారు. తెలంగాణతో కలిసి మరో 16 రాష్ట్రా లలో సాలినా రైతుల ఆదాయం ప్రతి నెలా రూ.1700 వస్తే, ఒక ప్రభుత్వ అటెండర్‌కు రూ 18 వేల జీతం వస్తుందన్నారు. ఉద్యోగుల వేతనాలు పెరి గితే కొనుగోలు శక్తి పెరుగుతుందని కొందరు వాదిస్తున్నారని, దేశ వ్యాప్తం గా ఉన్న 60 శాతం రైతులకు ఆదాయం పెరిగినా కొనుగోలు శక్తి పెరు గుతుంది కదా..? ఈ విషయంలో ఎందుకు ఆలోచించరని ప్రశ్నించారు. 98 శాతం సాగునీటి అవకాశాలు ఉన్న పంజాబ్ రాష్ట్రంలో కూడా రైతుల ఆత్మహత్యలు జరుగు తున్నాయని, నీటి అవకాశాలు ఉన్నంత మాత్రాన సరిపోదని, రైతు ఆదాయం పెరగాలని, అప్పుడే రైతుల ఆత్మ హత్యలను నివారించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

చంద్రబాబుది రైతులను పట్టణాలకు తరలించే ప్రయత్నం: రైతులను పల్లెల నుంచి పట్టణాలకు తరలించే ప్రయత్నాలను టిడిపి అధ్యక్షులు, ఎపి సిఎం చంద్రబాబుతో సహా చాలా మందే చేశారని, అదే వ్వయసాయ విధానంగా మారిందని తెలంగాణ జెఎసి ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ అన్నారు. మన రాష్ట్ర అవసరాల దృష్టా, రైతలకు ఆదాయం పెరిగేలా సమగ్ర వ్యవసాయ విధానంరావాలని, దీనికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశానికి టివివి అధ్యక్షులు గురిజాల రవీందర్ అధ్యక్షత వహించగా, టివివి ప్రధాన కార్యదర్శి తిప్పర్తి యాదయ్య, టిజెఎసి కన్వీనర్ కె.రఘుతో పాటు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ, సామాజిక కార్యకర్త సజయ, జెఎసి ప్రతినిధులు డాక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.