Home తాజా వార్తలు ఆమె సిఎం అయితే ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ: పన్నీరు

ఆమె సిఎం అయితే ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ: పన్నీరు

Panneer-Selvam

చెన్నై: శశికళపై అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం విరుచుకపడ్డారు. ఎవరు డ్రామాలు ఆడుతున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసునని చెప్పారు. శశికళ ముఖ్యమంత్రి అయితే ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మారుతారని దుయ్యబట్టారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో బాధ్యతలు చెపట్టానో ప్రజలకు తెలుసునని వాపోయారు. శశికళ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని మండిపడ్డారు. మధుసూదనన్ రావడం తమకు ఎంతో బలం చేకూరిందని, మధుసూదనన్‌ను శశికళ వర్గం బెదిరించిందని తెలిపారు. గతంలో జయలలితకు శశికళ రాసిన క్షమాపణ లేఖను చదివి వినిపించారు. అన్నాడిఎంకే పార్టీని కాపాడుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు. అమ్మ ఇంటిని స్మారక మందిరంగా మారుస్తామని ప్రకటించారు. పోయెస్ గార్డెన్ నుంచి శశికళను తరిమేస్తామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.