Search
Wednesday 14 November 2018
  • :
  • :

రక్తకణాలు తగ్గాయని వస్తే..కళ్ళు కనిపించకుండా పోయాయి

hospitel-image

ఆసుపత్రి ఎదుట బాధితుడి ఆందోళన
న్యాయం చేయాలని డిమాండ్
వైద్యం వల్ల అలా జరగదంటున్న డాక్టర్

మనతెలంగాణ/వేములవాడ: రక్తకణాలు తగ్గాయని వస్తే కళ్ళు కనిపించకు ండా చేశారని బాధిత కుటుంబం సోమవారం పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగింది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్షంపై అధికారులకు ఫి ర్యాదు చేయడమే కాకుండా న్యాయం కోసం పోరాటం చేస్తానని బాధితుడు నే రెళ్ల సాయిలు వెల్లడించగా వైద్యం వల్ల ఆలా జరగదని వైద్యులు వెల్లడించారు. బాధితుడి కథనం ప్రకారం.. బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల సాయిలు గత నెల 21వ తేదిన రక్తకణాలు తగ్గాయంటూ వేములవాడ పట్టణంలోని వెంకటేశ్వర నర్సింగ్ హోమ్‌లో చేరారన్నారు. అయితే ఐదు రోజుల చికిత్స అనంతరం తిరిగి ఇంటికి వెళ్లాక కళ్ళు పూర్తిగా కనిపించకుండా పోవడంతో మరుసటి రోజునే ఆసుపత్రికి వచ్చానన్నారు.అయితే ఆసుపత్రి వై ద్యులు ఇచ్చిన మందుల వల్లే తన కంటి చూపు కోల్పాయానని ఆవేదన వ్యక్తం చేశారు.వైద్యులే కరీంనగర్‌లోని చల్మెడ ఆసుపత్రికి తరలించగా తాను కంటి చూపు కోల్పోయినట్లుగాఅక్కడి వైద్యులు వెల్లడించారని తెలిపారు.ప్రస్తుతం కుడి క న్ను పూర్తిగా కనిపించడం లేదని,ఎడమకన్ను కూడా అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుందని వెల్లడించారు. బాధితుడు న్యాయం కోసం పోలీసులతో పాటు జి ల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు సాయిలు వెల్లడించారు. దాదాపు గంటపాటు ఆసుపత్రి ముందు కుటుంబం నిరసన వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయంపై డాక్టర్ మనోహర్‌ను వివిరణ అడుగగా నేరెళ్ల సాయిలు రక్తకణాలు తగ్గి తీవ్ర జ్వరంతో అ డ్మిట్ అయ్యాడు. కానీ వారు డిశ్చార్జ్ సమయంలో పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడనీ, అయితే చేసిన వైద్యం వల్లే కన్ను పోయే ప్రమాదం ఉండదు, తీవ్రజ్వరం వల్ల ఆ లా జరిగి ఉండవచ్చు కానీ..మా నిర్లక్షం వల్ల జరిగింది కాదన్నారు.

Comments

comments