Home నవ విజ్ఞానం కార్బన్ స్థాయిలు పెరిగితే భారత్‌కు గడ్డురోజులు

కార్బన్ స్థాయిలు పెరిగితే భారత్‌కు గడ్డురోజులు

If the carbon levels increase, India to worst days

2050 నాటికి భారత దేశంలో కొన్ని కోట్ల మంది పౌష్టిక విలువలు లోపించిన వారవుతారని అమెరికాకు చెందిన హార్వర్డ్ టిహెచ్ బాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు వెల్లడించారు. మనుషుల దైనందిన ప్రక్రియల ద్వారా కార్బన్ డయాక్సయిడ్ స్థాయిలు పెరిగి ప్రపంచం మొత్తం మీద 1.75 మిలియన్ మంది జింక్ లోపానికి గురవుతారని 122 మిలియన్ మంది ఈ శతాబ్దం మధ్యలో ప్రోటీన్ లోపానికి బలవుతారని పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. నేచర్ క్లైమేట్ చేంజి జర్నల్‌లో ఈ నివేదిక వెల్లడయింది. బిలియన్ మంది మహిళలు, పిల్లలు భారీ మొత్తంలో తమ ఆహారంలో ‘ఇనుము’ ధాతువును కోల్పోతారని, ఫలితంగా ఎనీమియా (రక్తహీనత), ఇతర వ్యాధులు సంక్రమిస్తాయని అధ్యయనం బయట పెట్టింది. దాదాపు 150 మిలియన్ ప్రజలు భారత దేశంలో జింక్ లోపానికి గురవుతారని ఇది భారత దేశానికి తీరని భారమవుతుందని నివేదిక వెల్లడించింది.

భారత్‌లో38 మిలియన్ ప్రజలు ప్రోటీన్ లోపించిన రిస్కులో పడతారని 502 మిలియన్ మహిళలు, పిల్లలు ఇనుము ధాతువు లోపంతో వ్యాధుల బారిన పడతారని పరిశోధకులు పేర్కొన్నారు. ఇదే విధంగా దక్షిణ ఆసియా , ఆగ్నేయాసియా, ఆఫ్రికా, పశ్చిమ ఆసియా దేశాలు అనేక సమస్యలను ఎదుర్కొంటాయి. ముఖ్యమయిన షోషకాలను మానవులు చెట్ల ద్వారా పొందుతుంటారు. 63శాతం పోషకాహార పోట్రిన్లు కూరగాయాలు, పండ్లు నుంచే లభిస్తుంటాయి. 81శాతం ఇనుము (ఐరన్), 68శాతం జింకు కూడా చెట్ల నుంచే లభిస్తుంది. అయితే కార్బన్ డయాక్సైడ్ వాతావరణాన్ని తీవ్ర స్థాయిలు తక్కువ పోషక విలువలు గలిగన పంటల దిగుబడిని ఇస్తాయి. ప్రోటీన్, ఐరన్, జింక్ సాంద్రతలు 3 నుంచి 17శాతం వరకు పంటల్లో తగ్గిపోతాయి. ప్రస్తుతం వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు మిలియన్‌కు 400 భాగాలు ఉంటున్నాయి. అదే కార్బన్ స్థాయిలు మిలియన్ 550 భాగాలు వంతున చేరుకుంటే పోట్రీన్లు,ఐరన్, జింకు శాతం పంటల్లో బాగా తగ్గిపోతుంది.

కార్బన్ డయాక్సైడ్‌కు సంబంధించిన పోషకాల శాతం151 దేశాల్లోని పంటల్లో ఎంతవరకు తగ్గిపోతుందో దానివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంతవరకు ఆరోగ్యభారం పెరుగుతుందో కచ్చితంగా విశ్లేషించగల సామర్థాన్ని అభివృద్ధి చేయవలసి ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ శతాబ్దం మధ్యలో వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ సాంద్రతలు 550 పిపిఎం స్థాయికి పెరగవచ్చని అధ్యయనంలో అంచన వేయడమయింది. 2050 నాటి జనాభా ఆధారంగా ప్రపంచ జనాభాలో 1.9 మంది అంటే దాదాపు 175 మిలియన్ మంది జింక్ లోపానికి గురవుతారని తెలుస్తోంది. ఇంతేకాకుండా బిడ్డలుకనే వయస్సున్న మహిళలు , అయిదేళ్లలోపు పిల్లలు మొత్తం 1.4 బిలియన్ మంది, ఎవరైతే ప్రస్తుతం ఐరన్ లోపంతో బాధపడుతున్నారో వారికి అప్పటికి 4శాతం వరకు మరింత ఐరన్ లోపిస్తుందని అధ్యయనం వెల్లడించింది.
– పరిశోధన విభాగం