Home ఆఫ్ బీట్ వంటగదిలో ప్రమాదం సంభవిస్తే?

వంటగదిలో ప్రమాదం సంభవిస్తే?

వంటగదిలో ఉన్నప్పుడు కొంచెం అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉంటే అక్కడ జరిగే ప్రమాదాలబారి నుండి తప్పించుకోవచ్చు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వంటగదిని ప్రమాదాలకు కేంద్రం గాకుండా చూసుకోవాలి. నిర్లక్షం చేయకుండా కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి మహిళలకుఎక్కువగా వంటగదిలోనే పనిఎక్కువ. భర్త, పిల్లలు, అత్తమామలకు టిఫిన్, భోజనం తయారు చేయడం, హడావిడిగా అన్ని పనులు చక్కదిద్దుకోవడం చేయాలి. ఉద్యోగం చేసే మహిళ అయితే ఆఫీసుకి సమయానికి వెళ్లాలన్న ఒత్తిడి పని త్వరగా కానిచ్చేలా చేస్తుంది. ఆ సమయంలో స్టౌ మీద ఉన్న గిన్నెను దించేటప్పుడు, పాలు, సాంబారు లాంటివి పొంగేటప్పుడు మూత తీయాల్సి వస్తుంది. ఆ సమయంలో అశ్రద్ధగా వేళ్లు కాలుతూ ఉంటాయి. ఏదో ఒక రకంగా మహిళలు వంటగదిలో బాధలు పడుతూ ఉంటారు.

kichen-room

ఇటీవల జరిగిన పరిశోధనల్లో 46 శాతం మహిళలకు ఉదయం పూటే ఇంటిలో ప్రమాదాలు జరుగుతున్నాయిట.వీటిలో 60 శాతం మహిళలు తీవ్ర గాయాలబారిన పడుతున్నారుట. ఎక్కువగా ఆడ వారికే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. వీటి నుండి కాపాడు కోవడానికి కొన్ని సూచనలు ..
పరిశుభ్రంగా ఉంటే…
కిచెన్‌లో నేల పరిశుభ్రంగా ఉండాలి. నేల మీద నీరు పడితే వెంటనే తుడిచివేయాలి. లేకపోతే బిజీ సమయంలో కాలు నీటిమీద పడి జారి పడిపోయే ప్రమాదం ఉంది.
* కిచెన్‌లో ఎత్తుగా ఉన్న అల్మరాలలో పెట్టిన వస్తువులు తీసుకునేటప్పుడు మెట్లు ఉన్న బల్లలు వాడాలి. ఛైర్, టేబుల్ లాంటివి వాడకూడదు.
* సామాన్లు శుభ్రంగా పద్ధతిలో సర్దుకోండి. వంట గిన్నెలు డైనింగ్ స్టాండ్ మీద పెట్టేటప్పుడు కింద ఏమీ అడ్డుతగలకుండా చూసుకోండి. సాంబారు లాంటివి తెచ్చేటప్పుడు కింద ఒలక్కుండా గిన్నెలు పట్టుకోవాలి.
* వంటగదిలో ఉన్నప్పుడు కాటన్ దుస్తులే ధరించాలి. ఈ విషయంలో మహిళలు అశ్రద్ధగా ఉంటారు. ఆఫీసుకు వెళతామనే ఉద్దేశంతో సిల్కు, నైలాన్ లాంటివి వేసుకుని వెళితే పొరపాటున నిప్పు అంటుకున్నా వేగంగా ప్రమాదాలు సంభవిస్తాయి.
ఏప్రాన్ ధరించి వంట చేస్తే మంచిది. ఇది మహిళలకు రక్షణ కవచంలా ఉపయోగిస్తుంది. చిన్న నిప్పు రవ్వ పడినా ఏప్రాన్ బట్టల్లోకి చొరబడకుండా కాపాడుతుందని రియాల్టీ షో మాస్టర్ చెఫ్ సీజన్ 2 టాప్ ఫైనలిస్టు విజయలక్ష్మి వివరించడం తెలిసిందే.
* కిచెన్‌లో వంట పని అయ్యాక మర్చిపోకుండా గ్యాస్ బర్నర్‌లను ఆఫ్ చేయటం, సిలిండర్ కట్టేయటం చేయాలి. ఎక్కువ ప్రమాదాలు గ్యాస్ సి లిండర్ వల్లే జరుగుతున్నాయి. చిన్నపిల్లలు సరదాగా గ్యాస్‌స్టౌ బర్నర్స్ తిప్పుతూ ఉంటారు. గ్యా స్ లీకై ప్రమాదాలు సంభవిస్తాయి. వారిని స్టౌ దగ్గరకు వెళ్ళనీయకుండా ఉండటమే మంచిది.
* కిచెన్‌లో ఫ్రిజ్ పెట్టకుండా ఉండడమే మంచిది. పొరపాటున ఉదయం లేవగానే ఆన్‌లో ఉన్న గ్యా స్ సిలిండర్, ఫ్రిజ్ రెండూ ఒక్కసారే బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. నిజానికి ఫ్రిజ్‌ను రోజంతా అనేకసార్లు మూసి తెరుస్తూ ఉంటారు. ఈ సమయంలో ఒక్కోసారి గ్యాస్ కూడా లీకవుతూ ఉం టుంది. కనుక సిలిండర్ ఆన్‌లో ఉంటే జరిగే ప్రమాదాన్ని ఎవ్వరూ ఆపలేరు. అందుకే ఫ్రిజ్‌ను కిచెన్‌కు దగ్గరలో పెట్టకూడదు.
* వంటగదిలో ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైనా ఉపయోగించేటప్పుడు చెప్పులు వేసుకోవాలి. మైక్రోవేవ్ లాంటి వస్తువులు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.