Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

పప్పు ధర పెరిగితే చికెన్‌ తినండి!

పాక్‌ ఆర్థికశాఖ మంత్రి

Pak-Financeఇస్లామాబాద్‌: పప్పు ధరలు చాలా ఖరీదుగా ఉన్నాయని పాకిస్థాన్‌ ప్రజలు అభిప్రాయపడితే దానికి బదులుగా చికెన్‌ తినాలని ఆదేశ కేబినెట్‌ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. కిలో పప్పు ధర రూ.260 ఉందని ప్రజలు అడిగితే దాని స్థానంలో చికెన్‌ తీసుకోవాలని మీ ఓటర్లకు చెప్పండని ఆర్థికశాఖ మంత్రి ఇషాఖ్‌ దార్‌ ప్రతిపక్ష నేతలకు సూచించారు. కిలో చికెన్‌ రూ.200లకే మార్కెట్‌లో అందుబాటులో ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. దేశంలో పప్పు దినుసుల ధరలు అకాశాన్ని అంటాయని ప్రతిపక్ష నేతలు ఆరోపించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

comments