Home హైదరాబాద్ మామూళ్లకు చెక్!

మామూళ్లకు చెక్!

If you do not pay the charges, it is wrong

వసూళ్లకు పాల్పడితే వేటు తప్పదు
మామూళ్లపై సమాచారం ఇవ్వాలన్న కమిషనర్లు
వాట్సాప్ నెం. 9490616555, 9490617111, 9490617444

మన తెలంగాణ/సిటీబ్యూరో: పోలీసులు పలవురు అవినీతికి పాల్పడుతున్నారంటూ, మామూళ్ళు వసూలు చేస్తున్నారంటూ పోలీసు డిజిపి విచారణలో తేలిందని నగరంలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇది పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నది. రోడ్‌మాస్టర్, కమిషన్ కలెక్టర్‌లుగా కొందరు మారినట్టు ఉన్నతాధికారులకు వారి జాబితా చేరినట్టు విస్తృతంగా ప్రచారం కావడంతో నగర వాసులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. మామూళ్ళు వసూళ్ళకు పాల్పడుతున్న వారిని బదిలీ చేయాల నే సంకేతాలు వెలువడటం, ఉన్నతస్థాయి అధికారులు రహస్యంగా విచారణ చేపట్టి ని వేదికను తెప్పించుకున్నారనేది  నగరవాసుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. అధికశాతం పోలీసు స్టేషన్‌లలో రోడ్‌మాస్ట ర్, కమిషన్ కలెక్టర్‌లు ఉన్నట్టు అధికారుల నివేదిక స్పష్టం చేసినట్టు పోలీసు వ ర్గాలే గుసగుసలాడుతున్నాయి. ముఖ్యంగా ఎఎస్‌ఐ నుంచి హోంగార్డు వరకు ఈ మామూళ్ళు వసూళ్లలో మునిగితేలుతున్నట్టు, వారెవరెవరనేది తెలుసుకునేందు కు ఇటు పోలీసులు, అటు నగరవాసుల్లో నూ ఉత్సాహం కనిపిస్తున్నది. ఎవరైతే బదిలీ అవుతారో వారు అక్రమార్జనకు పాల్పడినట్టుగా భావించాల్సిందేననేది నగరవాసుల అభిప్రాయం.

మామూళ్లకు చెక్…
నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది మమూళ్ళు అడిగితే తమకు నేరుగా ఫోన్ చేయాలని కమిషనర్ అంజనీకుమార్ తన ఫోన్ నె ంబర్ 9490616555 ను వెల్లడించారు. ఇటీవల సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ సస్పెన్షన్ సందర్భంగా ఈ ప్రకటనను వెలువరించారు. ఇప్పుడు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్, సైబరాబాద్ పోలీసు క మిషనర్ విసి సజ్జనార్‌లు కూడా ఇదే తరహాలో ప్రకటనను వెలువరించారు. తమ కమిషనరేట్‌ల పరిధిలోని బార్లు, మద్యం దుకాణాలు, లాడ్జ్‌లు, రెస్టారెంట్లు, హో టళ్లు, వ్యాపార కేంద్రాలు, గేమింగ్ జోన్లు, పెట్టి దుకాణాలు వంటి వాటి నిర్వాహకులు పోలీసులకు మామూళ్ళు ఇవ్వరాదని, ఎవరైనా అడిగితే నేరుగా 94906 17111, 9490617444 ఫోన్ నెంబర్లకు వాట్సాప్ ద్వారా సమాచారాన్ని చేరవేయాలని సూచించారు. వారిపై విచారణ జరిపి తగిన విభాగపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు.

బదిలీ వేటు తప్పదేమో..?
ఎఎస్‌ఐ నుండి హోంగార్డు వరకు మామూళ్ళు వసూలు చేసినట్టు పోలీసు అధికారులకు నివేదిక అందడంతో వారిపై బదిలీ వేటు వేయాలని ఉన్నతస్థాయి అధికారులు నిర్ణయించినది బహిరంగ రహాస్యమే. ఈపాటికే పలు స్టేషన్‌లలో వారిని గుర్తించి జాబితాను తయారుచేసినట్టు తెలుస్తోంది. అయితే, వారిని బదిలీతో కమిషనరేట్‌లను దాటిస్తారా లేక అదే కమిషనరేట్‌లో పోలీసు స్టేషన్‌లు మారుస్తారా.. ? అనేది పోలీసు వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇప్పుడు బదిలీ చేస్తే సహ ఉద్యోగులముందు చిన్నచూపుగా ఉంటుందనేది వారి అభిప్రాయం. మరి ఉన్నతస్థాయి అధికారులు ఏమేరకు నిర్ణయం తీసుకుంటారనేది వేచిచూడాలి.