Search
Wednesday 26 September 2018
  • :
  • :

9223166166కు ఎస్‌ఎంఎస్ చేస్తే ఓటుపై సందేహం నివృత్తి

If you do SMS to 9223166166, you can doubt the vote

మన తెలంగాణ/సిటీబ్యూరో: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా? లేదా? అనే సందేహం నివృత్తి చేసుకునేందుకు 9223166166 అనే ఫోన్ నెంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా తెలుసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ డాక్టర్ బి.జనార్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ జిల్లా పరిధిలో ఓటరు సవరణపై అధికారులతో జనార్ధన్‌రెడ్డి సమీక్ష సమావేశం ఓటుపై సందేహం నివృత్తం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జరుపుతున్నారని, అందులో భాగంగాపోలీంగ్ బూత్ స్థాయి అధికారులు మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి క్లైమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తున్నారని తెలిపారు. ఇంటింటి సర్వే సందర్భంగా ఓటర్ల జాబితాలో తమ పేర్లలేనివారు నమోదు చేసుకోవచ్చని, లేదా www.ceotelangana.nic.in అనే వైబ్‌సైట్ ద్వారా ఫారం – 6లో ఓటరు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. పేర్ల సవరణకు ఫారం – 8, అభ్యంతరాలకు ఫారం – 7ల ద్వారా చేసుకోవచ్చన్నారు. ఓటరు జాబితాలో తమ పేరు ఎన్నది, లేనిది తెలుసుకోవడానికి 9223166166 అనే పెల్ నెంబర్‌కు TS<SPACE> VOTER ID NO. (EXAMPLE TS VOTE ABC 1234567) మెసేజ్ పంపడం ద్వారా తెలుసుకోవచ్చునని జనార్ధన్‌రెడ్డి వివరించారు. దీంతో పాటు మై జిహెచ్‌ఎంసి మొబైల్ యాప్‌లో కూడా ఓటరు ఆన్‌లైన్ నమోదు, ఓటరు సమాచారం తెలుసుకునే విధానాన్ని కూడా ప్రవేశపెట్టినట్టు చెప్పారు.

బి.ఎల్.ఓలుగా రిటైర్డ్ అధికారులు…
పోలింగ్ బూత్ స్థాయి అధికారులుగా రిటైర్డ్ అధికారులను నియమించాలని జనార్ధన్‌రెడ్డి అదేశించారు. జిల్లా పరిధిలో పదవీవిరమణ చేసి, ఆరోగ్యంగా ఉన్న ఎంతోమంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారని, ఎన్నికల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదు ఇతర ఎన్నికల సంబంధిత విధులను నిర్వర్తించడానికి ఈ రిటైర్డ్ ఉద్యోగుల సేవలను ఉపయోగించుకోవాలని ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులను సూచించారు. రిటైర్డ్ ఉద్యోగులు తాము నివసించే ప్రాంతంతోని బి.ఎల్.ఓలుగా పనిచేసేందుకు సంబంధిత డిప్యూటి కమిషనర్ కార్యాలయాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులు తమ విధులను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తారని, వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అవసరమైతే ఆసరా సీనియర్ సిటీజన్లను కూడా బి.ఎల్.ఓలుగా తీసుకోవచ్చని స్పష్టం చేశారు. బి.ఎల్.ఓల జాబితాను ఎప్పటికప్పుడు సవరించి, వెబ్‌సైట్‌లో ప్రదర్శించడం ద్వారా పారదర్శకత పాటించాలని జనార్ధన్‌రెడ్డి అదేశించారు. నగరంలో ఇంటింటికి జరిగే ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా చేయాలని, ఇందుకుగాను ప్రతి పది మంది బి.ఎల్.ఓల పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక సూపర్‌వైజర్‌ను నియమించాలన్నారు. వీరితో పాటు సంబంధిత డిప్యూటి కమిషనర్, జోనల్ కమిషనర్లు కూడా బి.ఎల్.ఓల మాదిరిగానే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణపై నగరంలోని ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఎస్.ఎం.ఎస్ ద్వారా సమాచారం పంపాలని సూచించారు. నూతన ఓటర్ల నమోదు సందర్భంగా అందించే దరఖాస్తులు తప్పనిసరిగా సంతకం, మొబైల్ నెంబర్‌ను తీసుకోవాలని అన్నారు. ఓటర్ల జాబితా సవరణలో ఇంటింటికి వెళ్లి పరిశీలనను మరింత పారదర్శకంగా నిర్వహించాలని, ఈ విషయంలో ఏమైనా అవకతవకలు జరిగితే బాధ్యులపై ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి, చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎన్నికల అధికారి హెచ్చరించారు.

Comments

comments