Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

‘ఎంఎల్ఎ’లపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం…

If you do wrong campaigns against MLAs

యాదాద్రి భువనగిరి : ఆలేరు ఎంఎల్ఎ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను ప్రచారిస్తే  ఊరుకోమని టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య అన్నారు. బుధవారం కార్యకర్తలతో కలిసి గ్రామ పంచాయతీ ఆవరణలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాల్లో ఎంఎల్ఎకు టికెట్టు రాదని, ఏ పనులు చేయలేదని పలు తప్పుడు పోస్ట్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 60 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఏ ఎంఎల్ఎ చేయాని పనులు ఆయన స్థానికంగా అందుబాటులో ఉంటు ప్రతి గ్రామంలో 50 లక్షల పైగా అభివృధ్ధి పనులను చేపట్టారన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రజల సమస్యలను పరిష్కరిస్తు అభివృధ్ధికి తోడ్పడుతున్న ఎంఎల్ఎ సునీత అని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మోజార్టీతో సునీతమహెందర్‌రెడ్డి గెలుపు ఖాయమని తెలియజేశారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు, సర్పంచ్ బూడిది స్వామి, మిట్ట వెంకటయ్య, కీసరి బాల్‌రాజ్, అంకం సర్సింహ, రమేష్, కోల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments