Search
Wednesday 21 November 2018
  • :
  • :

రూ.19,999కే 40 ఇంచుల ఆండ్రాయిడ్ టివి

iFFALCON Android TVs

ముంబయి: ప్రముఖ టివిల తయారీదారు సంస్థ ఐఫాల్కన్ 2 కొత్త ఆండ్రాయిడ్ టివిలను బుధవారం ఇండియన్ మార్కెట్ లో రిలీజ్ చేసింది. 40ఎఫ్2ఎ, 49ఎఫ్2ఎ పేరిట 40, 49 ఇంచుల డిస్‌ప్లే సైజ్‌లలో ఈ టివిలు విడుదల అయ్యాయి. ఇవి గూగుల్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టివిలు కావడం వీటి ప్రత్యేకత. అయితే, ఆండ్రాయిడ్ 8.0, డాల్బీ సరౌండ్ సౌండ్, గూగుల్ క్రోమ్‌క్యాస్ట్, ఎఐ ఆధారిత గూగుల్ అసిస్టెంట్ వంటి అద్భుతఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటికి రెండు హెచ్‌డిఎంఐ పోర్టులను సంస్థ వినియోగదారులకు అందిస్తోంది. 40 ఇంచుల టివి ధర రూ.19,999 కాగా, 49 ఇంచుల టివి ధర రూ.27,999 లకు లభిస్తోంది. వీటిని ఇవాళా అర్థరాత్రి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానున్న దివాలి సేల్‌లో విక్రయించనున్నట్టు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు పలు రకాల వస్తులపై భారీ డిస్కాంట్ ను తమ కస్టమర్లకు అందిస్తున్నారు.

iFFALCON 40F2A and 49F2A Android TVs launched in India

mana telangana latest news

Comments

comments