Home జిల్లాలు ‘ఐఐఎం’ వరంగల్‌లోనే..??

‘ఐఐఎం’ వరంగల్‌లోనే..??

Kadiyam-Srihariవరంగల్: తెలంగాణ రాష్ట్రానికి మంజూరయ్యే ఐఐఎంను వరంగల్ జిల్లాలోనే ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. త్వరలోనే ఈ ప్రక్రియ విషయంపై సిఎం కెసిఆర్‌తో సమావేశం కానున్నట్లు చెప్పారు. వరంగల్‌లో ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, వ్యవసాయ కళాశాల, వెటర్నరీ కళాశాలలు ప్రారంభం కానున్నాయని కడియం ప్రకటించారు. సైనిక పాఠశాల ఏర్పాటు విషయంలో కేంద్రం జాప్యం చేయడంతో వచ్చే ఏడాది తరగతులు ప్రారంభం కానున్నాయన్నారు.