Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

దిగివస్తోన్న ద్రవ్యోల్బణం

bsns

 జనవరిలో 5.07 శాతం నమోదు
 డిసెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వేగవంతం
 కేంద్ర గణాంకాల శాఖ వెల్లడి

న్యూఢిల్లీ : ఐఐపి(పారిశ్రామిక ఉత్పిత్తి సూచీ) వృద్ధిని కొనసాగిస్తుండగా, మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం మెల్లగా దిగివస్తోంది. డిసెంబర్‌లో ఐఐపి 7.1 శాతానికి పెరిగింది. తయారీ రంగం, ఉత్పాదక వస్తువుల పనితీరు వేగవంతమవడంతో పారిశ్రామిక ఉత్పత్తి వేగంగా వృద్ధిని సాధిస్తోందని సిఎస్‌ఒ(కేంద్ర గణాంకాల శాఖ) పేర్కొం ది. అదే సమయంలో జనవరిలో వినియోగదారుల ధరల సూచీ(సిపిఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం దిగివచ్చింది. డిసెంబర్ నెలలో ఇది 17 నెలల గరిష్ఠ స్థాయిలో 5.21 శాతంగా ఉండగా, జనవరిలో 5.07 శాతానికి తగ్గుముఖం పట్టింది. అయితే ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) మధ్యకాలిక లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగానే ఉంది. ప్రధానంగా ఆహార, ఇంధన ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మంత్రిత్వశాఖ సోమవారం విడుదలైన గణాంకాల ప్రకారం ద్రవ్యోల్బ ణం కొలమానం జనవరి నెలలో 5.07 శాతానికి స్వల్పం గా తగ్గింది. డిసెంబరులో 5.21 శాతం నుంచి 5.14 శాతానికి తగ్గనుందని రాయిటర్స్ విశ్లేషకులు అంచనా వేశారు. మేకిన్ ఇండియాపై దృష్టి వల్ల వరుసగా ఫలితాలు కనిపిస్తున్నాయని, తయారీ రంగం డిసెంబర్ లో వేగంగా 8.4 శాతం వృద్ధిని సాధించిందని వాణిజ్య శాఖమంత్రి సురేష్ అన్నారు. ప్రధానంగా తయారీ రం గం 77.63 శాతం పెరగడం వల్ల డిసెంబర్‌లో ఐఐపి వేగవంతమైన వృద్ధిని నమోదు చేసిం ది. 2017 డిసెంబర్‌లో ఉత్పాదక వస్తువుల ద్రవ్యోల్బణం స్వల్పంగా 16.4 శాతానికి చేరగా.. 2016 ఇదే సమయంలో 6.2 శాతానికి క్షీణించింది. ఇంధనం ద్రవ్యోల్బణం డిసెంబరులో 7.90 శాతంతో పోలిస్తే తాజాగా 7.58 శాతానికి తగ్గింది.

Comments

comments