Search
Wednesday 26 September 2018
  • :
  • :

హైదరాబాద్‌లో ఐకియా తొలి స్టోర్ ప్రారంభం

IKEA

న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన రిటైల్ దిగ్గజం ఐకియా తొలి స్టోర్‌ను గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించింది. భారత్‌లో కంపెనీకి ఇది తొలి స్టోర్ కాగా, దీనిని రూ.1000 కోట్లతో ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న ఈ స్టోర్‌లో ప్రత్యక్షంగా దాదాపు 950 మంది సిబ్బంది పనిచేయాల్సి ఉంటుంది. అలాగే పరోక్షంగా 1500 మందికి ఉపాధిని కల్పిస్తోంది. 4 లక్షల చదరపు అడుగుల స్టోర్ 13 ఎకరాల్లో వ్యాపించి ఉంది. దాదాపు 7500 ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచుతారు. 1000 ఉత్పత్తులు రూ.200 లోపు కాస్ట్‌తో లభ్యమవుతాయని ఐకియా ప్రకటించింది.

Comments

comments