Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

‘రోబో 2’లో ఇలియానా?

ileana-Pathగోవా బ్యూటీ ఇలియానా చాలా కాలం తర్వాత తాజాగా చెన్నైలో అడుగుపెట్టింది. సౌత్ నుండి బాలీవుడ్ చేరిన ఈ భామకు అక్కడ ఆశించినంత సక్సెస్ రాలేదు. ముగ్గురు స్టార్ ఖాన్‌ల సినిమాల్లో ఏదైనా ఆఫర్ రాకపోతుందా అని ఎదురుచూసిన ఇలియానాకు సల్మాన్‌తో రాజశ్రీ ప్రొడక్షన్స్ మూవీ ఆఫర్ ఊరించి చేజారింది. లవ్ ఎఫైర్, హాట్ కామెంట్స్‌తో ప్రమోట్ కావాలని ప్రయత్నిస్తున్నా బాలీవుడ్‌లో ఆమె పెద్దగా పాపులర్ కాలేకపోతోంది. చివరికి అక్కడ కెరీర్ కష్టమని భావించిన ఇలియానా మెల్లిగా సౌత్ సినిమాలు చేయడానికి రెడీ అంటూ సిగ్నల్స్ ఇస్తోందట.

ఈ నేపథ్యంలోనే తాజాగా చెన్నైలో టాప్ డైరెక్టర్ శంకర్‌ను ఇలియానా కలిసింది. దీంతో అక్కడ ఆమెపై ఓ రకమైన ప్రచారం జరిగింది. దీంతో ఫైర్ అయిన ఈ అమ్మడు… ఒక పెద్ద డైరెక్టర్‌ను ఆయన ఇంట్లో లేదా గెస్ట్‌హౌస్‌లో హీరోయిన్లు కలవకూడదా…? అప్పుడు నా మేనేజర్, కారు డ్రైవర్ నాతోనే ఉన్నారు… అంటూ వాపోయింది. గతంలో శంకర్ దర్శకత్వంలో 3 ఇడియట్స్ రీమేక్ ‘స్నేహితుడు’లో ఇలి యానా నటించింది. ప్రస్తుతం ‘రోబో 2’లో నటించేందుకు శంకర్ కబురు చేశాడా…? లేక తనే ఆఫర్స్ కోసం శంకర్‌ను కలిసిందా అనే విషయం ఇంకా తెలియరాలేదు. డైరెక్టర్ గెస్ట్‌హౌస్‌కు వెళ్లడంతో అక్కడి మీడియా రచ్చ చేయడంతో ఇలియానా గుర్రుగా ఉందని టాక్.

Comments

comments