Home సినిమా అమెరికా నుంచి ముంబయికి..

అమెరికా నుంచి ముంబయికి..

Ileana

తొలి సినిమా ‘దేవదాసు’తో సూపర్‌హిట్ కొట్టేసి ఆతర్వాత సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో ‘పోకిరి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న బ్యూటీ ఇలియానా. ఎనిమిదేళ్ల పాటు టాలీవుడ్‌లో హవా సాగించిన ఈ గోవా బ్యూటీ ఇక్కడ అవకాశాలు వస్తుండగానే బాలీవుడ్‌కు వెళ్లింది. చాలా ఏళ్ల విరామం తర్వాత ఎట్టకేలకు తెలుగులో ఒక సినిమా అంగీకరించింది ఇలియానా. రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’లో ఈ భామ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ నెలన్నర రోజులు అమెరికాలో జరిగింది. అమెరికాలో జరిగిన షూటింగ్‌లో ఇలియానా పాల్గొంది. దాదాపు నెల రోజుల పాటు సినిమా చిత్రీకరణలో పాలుపంచుకుంది. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తవడంతో ఇలియానా రవితేజ అండ్ టీంకు టాటా చెప్పేసి ముంబయికి పయనమైంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల ఆమెకు ప్రత్యేక బహుమతి కూడా ఇచ్చాడు. అయితే మరో షెడ్యూల్‌లో కూడా ఈ భామ పాల్గొంటుంది.