Home సినిమా ఇలియానాకు ఇదే మొదటిసారి

ఇలియానాకు ఇదే మొదటిసారి

Ileana

రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది ఇలియానా. ఈ చిత్రంలో ఈ బ్యూటీ తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇక తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఆమెకు ఇదే మొదటిసారి. పాత్ర డిమాండ్ చేయడంతో ఇలియానా పాత్రకు తనతోనే డబ్బింగ్ చెప్పించాలని శ్రీనువైట్ల నిర్ణయించారు. ఈమేరకు ఇలియానా నాలుగు రోజుల్లోనే తన డబ్బింగ్ పార్టును పూర్తి చేయడం విశేషం. ఇక రవితేజతో ఇలియానా కలిసి నటిస్తున్న నాలుగో చిత్రమిది. ఈ కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈనెల 10న ఎంతో గ్రాండ్‌గా జరుగనుంది. ఈనెల 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకానుంది. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తుండగా వెంకట్.సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవిప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్, విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్‌ః ఎం.ఆర్.వర్మ, ఆర్ట్‌ః ఎ.ఎస్.ప్రకాష్, కథః శ్రీనువైట్ల, వంశీ రాజేష్ కొండవీటి, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వంః శ్రీనువైట్ల.

Ileana Made Her Own Dubbing In Telugu For First Time 

Telangana News