Search
Wednesday 21 November 2018
  • :
  • :

నాకు ఇదేం కొత్త కాదు..హ్యాపీగా ఉండండి

kohli
న్యూఢిల్లీ: విదేశీ ఆటగాళ్లను ఇష్టపడే వారు దేశం వదిలి వెళ్లాలంటూ టిమిండియా సారథి విరాట్ కోహ్లీ…ఒక అభిమానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. కోహ్లీని ఓవర్‌రేటెడ్ బ్యాట్స్‌మెన్ అని, తనకు భారత బ్యాట్స్‌మెన్లకంటే ఇంగ్లీష్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు అంటేనే ఇష్టమని ఓ అభిమాని చేసిన కామెంట్‌పై కోహ్లీ స్పందిస్తూ.. అలాంటప్పుడు మీరు ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదు అని అన్నాడు. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇతర దేశాల ఆటగాళ్లను ఇష్టపడినంత మాత్రన దేశం వదిలి వెళ్లాలా అంటూ విరాట్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మీరు విదేశంలో పెళ్లి చేసుకుంటారు..విదేశీ భాషను మాట్లాడుతూ, విదేశీ క్రీడను ఆడుతూ డబ్బు సంపాదిస్తారు.. కానీ మేము విదేశీ ఆటగాళ్లని మాత్రం ఇష్టపడకూడదా..? అని ప్రశ్నిస్తున్నారు.
అయితే ఈ ట్రోల్స్‌పై తాజాగా విరాట్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించాడు. ‘నాపై ఇటువంటి కామెంట్లు రావడం ఇదేం కొత్త కాదు. ‘ఈ భారతీయులు’ అంటూ ఓ అభిమాని చేసిన వ్యాఖ్య పట్ల మాత్రమే నేను అలా మాట్లాడాను. నేను మీ అందరికి ఉన్న స్వేచ్ఛను గౌరవిస్తాను. ఈ విషయాన్ని తేలికగా తీసుకోండి. పండుగ వాతావరణంలో హాయిగా గడపండి. మీ అందరూ ఎంతో ప్రేమ, శాంతితో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలను కోహ్లీ పోస్ట్ చేశాడు. అయితే కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వస్తున్నా.. మరికొందరు మాత్రం కోహ్లీ చేసిన కామెంట్స్‌కి మద్దతుగా కామెంట్ చేస్తున్నారు.

‘I’ll stick to getting trolled:Virat Kohli

Comments

comments