Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పశువుల అక్రమ రవాణా..

Illegal  Cattle Transport in Nizamabad District
జుక్కల్: అక్రమంగా కర్ణాటకకు తరలుతున్న 9 పశువులను జుక్కల్, మహ్మదాబాద్ గ్రామానికి చెందిన యువకులు  సోమవారం అడ్డుకున్నారు. అనంతరం ఒక ట్రక్కులో తరలుతున్న పశువులను తీసుకుని పోలీస్టేషన్ చేరుకున్నారు. అక్కడి నుంచి గ్రామ కార్యదర్శి వేజనకు ఫోన్లో సమాచారం అందించడంతో ఆయన వచ్చి వివరాలు సేకరించుకుని పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే మండలంలోని మహ్మదాబాద్ గ్రామానికి చెందిన 9 పశువులు (ఆవులు, బర్రెలు, దూడలు, దున్నపోతులు) తరలిస్తుండగా అదే గ్రామానికి చెందిన భజరంగ్‌దళ్ సభ్యులు జక్కల్ మండల కేంద్రంలోని సభ్యులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి వెళ్ళి అడ్డుకున్నారు. అయితే వాటిని కర్ణాటక చిక్లి గ్రామానికి విక్రయించినట్లు మహ్మదాబాద్‌కు చెందిన వ్యక్తి తెలిపారు. కర్ణాటకకు చెందిన అలీసాబ్ అనే వ్యక్తి ఈ పశువులను కొనుగోలు చేసినట్లు తెలిసింది. అక్రమంగా తరలిస్తున్న పశువులకు ఎలాంటి విక్రయించిన పత్రాలు గ్రామ పంచాయతికి సంబంధించినవి లేకపోవడంతో వారిపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే భజరంగ్‌దళ్ సభ్యులు మాత్రం పశువులను యేదైన గోఆశ్రమానికి అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Comments

comments