Home రంగారెడ్డి చెరువులలో అక్రమంగా నల్లమట్టి తరలింపు

చెరువులలో అక్రమంగా నల్లమట్టి తరలింపు

Illegal Mud Transport In Ponds In Rangaredy Dist

మన తెలంగాణ / కందుకూరు  ః  కందుకూరు మండలంలోని పలు చెరువు కుంటలతో పాటు పట్టా సీలింగ్ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరిపి అక్రమార్కులు కొట్ల రుపాయలు కొల్లగోడుతున్నా రెవెన్యూ అధికారులుగాని, ప్రజాప్రతినిథులు గాని నిమ్మకు నిరేత్తనట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమ సంపాధకు అలవాటుపడ్డ కొందరూ చెరువులో నల్లమట్టి తరలింపుపై పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టంగా చెరువుల పునరుద్దణ పనులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని  ముందుకు తీసుకుపోవాలని చూస్తున్న ఇలాంటి పరిస్థితులు నిత్యం కనిపిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఖజనాకు తూట్లుపడుతుండగా అక్రమార్కులు లారీలు, టిప్పర్లలో ప్రతి రోజు రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని ఇసుక బట్టిలకు ఇతర గృహ నిర్మాణాలకు, రియల్‌ఎస్టేట్ వెంచర్లకు సైతం తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కొత్తగూడ, ధన్నారం మీర్కాన్‌పేట్ గ్రామాల్లో అక్రమ మట్టి రవాణా యదేచ్చగా జరుగుతుంది. కాంట్రాక్టర్లు, ఇసుకబట్టి యాజమానులతో కుమ్మకై ఇతర శాఖల అధికారుల అండదండలకు ముడుపులు చేల్లిస్తూ చేరువుల మట్టిని కాజేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  మరికొన్ని చెరువుల్లో , కుంటల్లో ఇసుక బట్టి యాజమానులు , బిల్డర్లు ప్రభుత్వ సెలవు దినాలను అసరాగా చేసుకోని మట్టి తరలిస్తున్నా అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరించడం అవినీతిని తేటతెల్లం చేస్తుంది. ఇసుక బట్టి యజమానులు చెరువు కుంటులు మట్టిని తరలించుకుపోతే మిషన్ కాకతీయ కాంట్రాక్టర్లు ఇరిగేషన్ శాఖ అధికారులు కనుసన్నల్లో బిల్లులు డ్రా చేసుకుంటున్న సంఘటనలు ఎన్నో వున్నాయి. నల్లమట్టిని ఇటుకల తయారికి తరలిస్తుండగా  దుబ్బమట్టిని కృత్రిమ ఇసుక పిల్టర్లకు  తరలించడం చర్చనియాంశంగా మారినా అధికారులు, పోలీసులు నామమాత్రపు కేసులు పెట్టి  చేతులు దులుపు కుంటున్నారు. కందుకూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రతి నిథ్యం అక్రమంగా తరలిస్తున్న మట్టి రవాణాకు అడ్డుకట్టవేయకపోతే భవిష్యత్తులో భూగర్భజలాలు అడుగంటి పోయి తీవ్ర దుర్బిక్షం ఏర్పడే పరిణామం ఉందని పర్యావరణవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.