Search
Friday 21 September 2018
  • :
  • :

జోరుగా బ్లాక్ దందా..

Illegal to Sell Liquor in PanShop in Warangal Dist
పర్వతగిరి: మండలంలోని అన్నారం షరీఫ్ గ్రామంలోని చిన్న దర్గాల పరిసర ప్రాంతల దగ్గర ఉన్నటు వంటి ప్రముఖ పాన్‌షాప్ లో ’బ్లాక్’మద్యం ఏరులై పారుతుంది. అన్నారం షరిఫ్ మణికంఠ వైన్స్ షాప్ నుండి పాన్ షాప్‌కి మద్యం సరఫరా అవుతుందని గ్రామ ప్రజలు అంటున్నారు. ఎక్సైజ్ అధికారులు దాడులు చెయ్యడానికి వచ్చిన ప్రతి సారి ఈ పాన్ షాప్ మూసి ఉండటం గమనార్హం. అధికారులు దాడులు చెయ్యడానికి వచ్చె కొన్ని క్షణాల్లోనె బ్లాక్ బాబు షాప్ మూసి , అధికారులు వెళ్లినాక మళ్లీ వచ్చి అదె జోరుగా బ్లాక్ దందా షురు చెయ్యడం షర మాములుగా తయారయ్యింది. వీరికి ఎక్సైజ్ అధికారులలో ఎవరైన సహయం చెస్తున్నారని గ్రామ ప్రజలు అంటున్నారు. వారి దైర్యంతోనే పాన్ షాప్ యజమాని అన్నారంలో వైన్స్‌షాప్ ఉన్న కూడా ఒక్కొక్క బీర్ మీద 30 నుండి 40 అదే చీప్ లిక్కర్ అయితే 20 నుండి30 రుపాయల వరకు సమయాన్ని బట్టి మళ్లీ ధర పెరుగుతుందని , గ్రామంలో వైన్స్ ఉన్న కూడా బ్లాక్‌లో అధిక ధరలకు మందు కొనవలసి వస్తుందని మందు బాబులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. వైన్స్‌లో కంటే ఈ బ్లాక్ షాపులోనే ప్రతి ఒక్క రకాలైన మందు(లిక్కర్) దొరుకుతుందని అక్కడికి వెళ్లి ధరలు విని గుండెల్లో దడలు పుడుతున్నాయని మందు బాబులు అంటున్నారు. పై అధికారులు ఇప్పటికైన ఈ విషయం పై స్పందించి బ్లాక్ దందాను అరికట్టి షాప్ ను ముసి వెయ్యాలని గ్రామ ప్రజలు,మందు బాబులు కొరుతున్నారు.

Comments

comments