Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఎక్కడికక్కడే గప్‌చుప్

పెరిగిన అధికారుల నిఘా
సగానికి తగ్గిన కందుల రాబడి
ఊసేలేని బినామీలపై విచారణ

 కొత్త ఎత్తుగడలతో వ్యాపారులు

Lentils

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : నాగర్‌కర్నూల్ మార్కెట్‌లో వ్యాపారుల కందుల అక్రమ వ్యవహారం ను జిల్లా కలెక్టర్ సిరియస్‌గా తీసుకున్నారు. నిజమైన రైతులు నష్ట పో కుండా చూసేందుకు బీనామీలను అదుపు చేసేందుకు జా యింట్ కలెక్టర్ సురేందర్ కరణ్ నిత్యం ఏదో ఒక సమయం లో మార్కెట్ యార్డును సందర్శించి తనీఖీలు నిర్వహిస్తున్నా రు. ఇంత వరకు బాగానే ఉన్న జోరుగా అక్రమ వ్యాపారం జరిగిన దాదాపు నెల రోజుల కొనుగోళ్లు, బీనామీ రైతుల గుట్టురట్టు చేసే విషయంలో మాత్రం అధికారులు ఒక్క అడు గు కూడా ముందుకు వేయలేదు.

ధృవీకరణ పత్రం ఉంటేనే..

కందులు అమ్మకానికి వచ్చే ప్రతి రైతు సంబంధిత గ్రామ వీఆర్‌ఓ నుండి ఖచ్చితంగా ధృవీకరణ పత్రం తీసుకురా వాల ని అధికారులు ఆదేశించారు. ధృవీకరణ పత్రం తెచ్చిన రైతుల విషయంలో అనుమానం వచ్చినా అక్కడే ఉన్న వ్యవసాయాధి కారి వెంటనే ఆ వీఆర్‌ఓకు ఫోన్ చేసి మరి వివరాలు అడు గుతున్నారు. మార్క్‌ఫెడ్ అధికారులతో పాటు జిల్లా మార్కె టింగ్ అధికారిణి బాలమణి సైతం మార్కెట్ యార్డు కలియ తిరుగుతూ కొనుగోళ్లలో అక్రమాలు జరగకుండా చూస్తు న్నారు.

పెరుగుతున్న రైతులు తగ్గుతున్న కందులు..

మార్క్‌ఫెడ్ కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం అయిన నెల రోజుల లోపు దాదాపు 1000 మంది లోపు రైతులు 21, 500 బస్తాల కందులను మార్కెట్‌లో అమ్మకాలు చేశారు. సో మవారం ఒక్క రోజే దాదాపు నాలుగు వేల బస్తాలు మార్కె ట్‌కు వచ్చాయి. కందుల అక్రమ వ్యాపారం గుట్టురట్టు కావ టంతో అధికారుల పర్యవేక్షణ పెరిగింది. దీంతో వ్యాపారులు బీనామీ పేర్లతో అమ్మకాలు సాగించేందుకు చేసిన ప్రయత్నా లు బేడిసికొట్టాయి. కుప్పలు కుప్పలుగా పోసిన కందులు చేసేది లేక ఎవరికి వారు బస్తాలలో నింపుకోని స్వంత గోదాం లలోకి తరలించారు. దాదాపు నెల రోజుల పాటు 21 వేలకు పైగా బస్తాలు 900 మంది రైతులు అమ్మినట్లు రికార్డులలో ఉంది.

సోమవారం అక్రమాలు వెలుగు చూసిన తర్వాత గత మూడు రోజులుగా అది భారీగా తగ్గిపోయింది. మంగళవా రం 64 మంది రైతులు 689 బస్తాలు, బుధవారం 24 మంది రైతులు 505 బస్తాలు, గురువారం 35 మంది రైతులు 447 బస్తాల కందులు మాత్రమే అమ్ముకున్నారు. ఇదిలా ఉండగా తమ వద్ద అక్రమంగా నిల్వ ఉంచుకున్న కందులు మార్క్‌ఫెడ్ ఖాతాలో అధిక ధరకు వేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యాపారు లు మారిన పరిస్థితుల్లో కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్లు సమాచా రం. ముఖ్యంగా వారికి అనుకులమైన రైతులను(బీనామీ లను) ముందుంచి వీఆర్‌ఓ లేఖలు తెచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కొద్ది రోజులు వేచి చూసి అధికారుల ఒత్తిడి సద్దు మణిగిన తర్వాత అమ్ముకో వాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా భూమి ఉన్న ప్రతి రైతుకు కందులు పండినట్లు వీఆర్‌ఓలు సర్టిఫికేట్లు ఇస్తున్నట్లు దానిపై ఏలాంటి విచారణ ఉండబోదన్న ధీమాతో ఉన్నట్లు తెలిసింది.

చెక్కులు నిలిపి వేయాలి..

కాగా బీనామీ రైతుల పేరున వ్యాపారులు అమ్మిన అధిక మొత్తం కందుల విషయంలో రైతుల వారిగా విచారణ జర పాలని పలువురు డిమాండ్ చేశారు. అంత వరకు పెద్ద మొత్తంలో ఉన్న వాటికి సంబంధించి చెక్కులు ఇవ్వకుండా నిలిపి వేయాలని దీని వలన మునుముందు ఇలాంటి తప్పు డు వ్యవహారాలు చేసేందుకు సాహసించ బోమని పలువురు డిమాండ్ చేశారు.

Comments

comments