Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

యధేచ్చగా ఇసుక అక్రమ రవాణా…

Sand-Illegal-Transport

ఖమ్మం: మండల పరిధిలోని వైరా నది పరివాహక ప్రాంతమైన గ్రామాల్లో ఇసుక రీచ్‌ల నుండి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న విషయం అందరికి విదితమే. ఈ విషయం పై కలెక్టర్ దృష్టి సారించడంతో వారి ఆదేశాల మేరకు మండలంలో గనులు మరియు భూగర్భశాఖ లు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మండల పరిధిలోని తొర్లపాడు, మహాదేవపురం, దిడుగుపాడుఇసుక రేవులను వారు సందర్శించారు. ఈ సందర్భంగా దిడుగుపాడు రేవు నుండి అధిక లోడ్‌తో వస్తున్న ఇసుక ట్రాక్టర్లను అధికారులు పట్టుకున్నారు. ఈ దాడుల్లో రాయల్టీ ఇన్‌స్పెక్టర్ ఆర్ రవీందర్ జియాజిస్ట్ టి.సత్యనారాయణ, టెక్నికల్ అసిస్టెంట్ రాంమూర్తి తదితరులు ఉన్నారు.

Comments

comments