Home వికారాబాద్ అటవీ శాఖలో అంతులేని అవినీతి

అటవీ శాఖలో అంతులేని అవినీతి

Illegal Transport Take In Vikarabad Dist
తాండూరుః ప్రకృతి సంపదలేక ప్రభుత్వం చెట్టును పెంచాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే అటవీ శాఖ అధికారుల చేతి వాటం కారణంగా ఉన్న ప్రకృతి సంపద రాష్ట్ర సరిహాద్దులు దాటుతుంది.లక్షల రూపాయల కలప,టేకు,వేప ప్రతి రోజు రాష్ట్ర సరిహాద్దులు దాటుతుంది. చెట్లను కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులు ఇందుకు సహారించడంతో యధేశ్చగా తరలిపోతుంది. తాండూరు డివిజన్‌లోని పెద్దేముల్ మండలం నాగులపల్లి,ఆత్కూర్ యాలాల మండలం రాస్నం ధారూర్ మండల పరిధిలో విరివిగా అటవీ భూములు ఉన్నాయి.ఇక్కడ ఉన్న అటవీ ప్రాంతంలో విలువైన కలప,వేప,చేకు చెట్లు అధికంగా ఉన్నాయి.అయితే అటవీ శాఖ అధికారుల అండతో ఇక్కడి విలువైన కలప,వేప,చేకుచెట్లను రాత్రి సమయాలలో పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు.గత నాలుగు నెలల క్రితం ఈ విషయంపై వచ్చిన ఫిర్యాదులపై అటవీ శాఖ అధికారులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిని సస్పండ్ చేశారు. అయిన అక్రమ రవాణా కొనసాగుతుంది. అంతే కాకుండా డివిజన్‌లోని పలు గ్రామాలలో రైతుల పొలాల వద్ద ఎక్కువగా టేకు చెట్లను సాగు చేశారు.

రైతుల పొలాల వద్ద ఉన్న చెట్లను నరకడానికి సైతం స్థానిక తహాశిల్దార్ అనుమతులు పొందాలి. ఎలాంటి అనుమతులు లేకుండానే టెేకు అక్రమ రవాణా అవుతుంది.ముంబాయి నుండి ఇక్కడి వచ్చిన అక్రమార్కులు రాత్రి సయమంలో టేకు రవాణా చేస్తున్నారు. ఒక్కో చెట్టు సుమారు లక్ష రూపాయల వరకు విలువ చేస్తుంది.తాండూరు పట్టణంలో సామిల్‌ల సహాయంతో చేకు చెట్లను అక్కడి ముక్కలు చేసి నేరుగా లారీలలో ముంబాయి తరలిస్తున్నారు. తాండూరు ప్రాంతం రాష్ట్ర సరిహాద్దులో ఉండటం కేవలం 12 కిలోమీటర్లలో కర్ణాటక సరిహాద్దు ఉండటం సరిహాద్దులలో చెక్ పోస్టులు లేక పోవడం కనీసం పోలీస్ చెక్ పోస్టులు కూడ లేక పోవడంతో అక్రమ రవాణా కొనసాగుంది. తాండూరు పట్టణంలోని సామిల్‌లలో ఇప్పటికి కోట్ల రూపాయల విలువైన కలప,చేకు,వేప అక్రమంగా నిల్వ ఉంచిన అధికారులు మాత్రం అటువైపు దాడులు చేయడం లేదు.ఇప్పటికైన అటవీ శాఖ,పోలీస్ శాఖ అధికారులు స్పందించి చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని తాండూరు పట్టణంలోని నిలువ ఉంచిన కలప,టేకు,వేపను సీజ్ చేయాలని రాష్ట్ర సరిహాద్దులో జరుగుతున్న అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.