Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

యథేచ్ఛగా అక్రమ నీటి వ్యాపారం

సహకరిస్తున్న అధికారులు
వాల్టా చట్టానికి తూట్లు
అడుగంటుతున్న జలాలు

WATER

మన తెలంగాణ/మల్కాజిగిరి : మల్కాజిగిరిలో ఒకప్పుడు బోరు వేస్తే 250 అడుగులకే నీరు పడేది. ఇప్పుడు 1800 అడుగుల లోతుకు వెళ్ళినా సరిగా నీరు పడని దుస్థితి. మల్కాజిగిరిలో నిబంధనలను అతిక్రమించి భూగర్భ జలాలతో కొంత మంది చేస్తున్న అక్రమ నీటి వ్యాపారమే దీనికి మూల కారణం. అరికట్టాల్సిన అధికారులు పట్టించుకోరు. ఒక వేళ చర్యలు తీసుకున్నా అది నామమాత్రమే. అధికారుల నిర్లక్షం, సహకారం కారణంగా మల్కాజిగిరిలో అక్రమ నీటి వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతోంది.

చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు కాసులకు కక్కుర్తిపడి అక్రమార్కులకు సహకరిస్తున్నారు. ఎపుడో ఒక సారి తాత్కాళిక చర్యలతో సరిపెడుతున్నారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో చంద్రగిరి కాలనీ, లాల్ వాణీ నగర్, చెరువుల పరిసర ప్రాంతాలలో నిబంధనలకు విరుద్దంగా ఆరున్నర అంగులాల బోర్లు వేసి వాటి ద్వారా యధేచ్చగా ట్యాంకర్లలో సరాఫరా చేస్తూ భూగర్భ నీటితో అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఒక్క ట్యాంకర్‌కు నిర్వాహకులు 300 నుండి 450కి బోరు నీటిని విక్రయిస్తుండగా ట్యాంకర్ నిర్వాహకులు 750 నుండి 850కి విక్రయిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అదే విధంగా ఆనంద్‌బాగ్, యాదవనగర్, వెంకటేశ్వర నగర్ తదితర ప్రాంతాలలో నిబంధనలను నీళ్ళలో కలిపి వాటర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసి 20 లీటర్ల క్యాన్‌లలో విక్రయిస్తు న్నారు. ఈ కారణంగా చుట్టు పక్కలవారి బోర్లు ఎండి పోతున్నాయని స్థానికులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. స్థానికులెవరైనా అక్రమ నీటి వ్యాపారంపై ఫిర్యాదు చేస్తే స్పందించి చర్యలు తీసుకోవడంలో నిర్లక్షంగా వ్యవహరి స్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమ నీటి వ్యాపార వ్యవహారమంతా కూడా సంబంధిత అధికారుల అండ దండలతోనే జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ప్రతీ నెలాసంబంధిత అధికారులకు మామూళ్ళు అందుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
సీజ్ చేసినట్టే చేసి …
గతంలో చంద్రగిరి కాలనీలో జరుగుతన్నఅక్రమనీటి వ్యాపారం రెవెన్యూ అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై అధికారులు వెంటనే స్పందించి బోర్‌ను సీజ్ చేశారు. అయితే ఈ చర్య ఎంతో కాలం నిలువలేదు. సంబంధిత అధికారులు లోపాయకారి ఒప్పందాలు చేసుకుని అక్రమనీటి వ్యాపారానికి అంగీకరిస్తూ బోర్‌కు వేసిన సీల్‌ను తొలగించారు. ఆ నాటి నుండి నేటి వరకు ఆ వ్యక్తి బహిరంగంగా యధేచ్చగా భూ గర్భ నీటితో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అధికారుల సహకారం ఏ మేర ఉందో అర్థం కావడానికి ఇదే నిదర్శనం.
స్పందించని ఎమార్వో…
పై అంశపై మల్కాజిగిరి మండల తహసీల్దార్ గౌరీ వత్సలను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె స్పందించలేదు.

Comments

comments