Home తాజా వార్తలు అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలి…

అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలి…

Illegal wines

 

షాద్‌నగర్ : గ్రామాల్లో నిర్వహిస్తున్న అక్రమ మద్యం విక్రయాలను, బెల్టు షాపులను అరికట్టాలని షాద్‌నగర్ సిఐ శ్రీధర్‌కుమార్ అన్నారు. శనివారం ఫరూఖ్‌నగర్ మండలం దేవునిపల్లి గ్రామంలో అక్రమంగా బెల్టు షాపులు నిర్వహిస్తున్న వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌కుమార్ మాట్లాడుతూ… గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులను వెంటనే మూసి వేయాలని, లేనిపక్షంలో నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరపడం వల్ల గ్రామస్తులు మద్యానికి అలవాటు పడి, తరచూ గొడవలు జరుగుతున్నాయని వివరించారు.

అలాగే దేవునిపల్లి గ్రామాన్ని షాద్‌నగర్ పోలీసు శాఖ తరపున దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామంలో బెల్టు షాపులు నిర్వహిస్తున్న ఎనిమిది మందిని ఫరూఖ్‌నగర్ తహశీల్దార్ ముందు బైండోవర్ చేశారు. మళ్లీ బెల్టు షాపులు నిర్వహిస్తే లక్ష రూపాయల జరిమానాతో పాటు, జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ విజయ్‌భాస్కర్, పోలీసు సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Illegal wines sales should be stopped