Home ఆఫ్ బీట్ రాబందుల్లా…’టన్ను’కుపోతున్నారు

రాబందుల్లా…’టన్ను’కుపోతున్నారు

Ration-Rice

పట్టుబడుతున్న అక్రమ రేషన్ బియ్యం
పేదలకు దక్కని ప్రభుత్వ సబ్సిడీ

నల్లగొండ ప్రతినిధి : శనివారం భువనగిరిలో 450 బస్తాలు, సోమవారం మిర్యాలగూడలో 300 బస్తాల పిడియస్ బియ్యాన్ని దళారులు అక్రమంగా తరలిస్తూ అధికారులకు పట్టుబడ్డారు. అక్రమార్కుల వల్ల ప్రజా పంపిణి బియ్యం పూర్తి స్థాయిలో పేదలకు దక్కడం లేదు. మార్కెట్ మధ్య దళారులు రేషన్ డీలర్లతో కుమ్మక్కై పెద్ద ఎత్తున పిడియస్ బియ్యాన్ని ప్రక్కదారి పట్టిస్తున్నారు. నిత్యం ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక మూల పేదల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ పట్టుబడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. గత రెండు నెలలనుండి  ఉమ్మడి జిల్లాలో పలుమండలాలు, పట్ట ణాల్లో బియ్యం దందా కొనసాగుతూనే వుంది. శనివారం భు వనగిరి జిల్లా 450 బస్తాల బియ్యాన్ని విజిలెన్స్ అదికారులు పట్టుకున్నారు. వివిధ మిల్లుల ద్వారా దళారులు ఈ బియ్యాన్ని సేకరి ంచారనే కోణంలో గతంలో బియ్యం అక్రమ వ్యాపా రా నికి పాల్పడిన మూడుజిల్లాలకు చెందిన వ్యాపా రులను  విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. కాగా సోమవారం మిర్యాలగూడలో 300 పిడియస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.

గత ఫిభ్రవరిలో మిర్యాలగూడలోని పాడుబడిన రైసుమిల్లులో అక్రమంగా దాచిన 178 బస్తాల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నకిరేకల్ మండలం మండలాపురంలో  ట్రాక్టర్ ట్రాలీలో 20 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టు కు న్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో పోలా వెం కన్న అనే వ్యక్తి అక్రమంగా నిల్వ చేసిన 33 క్వింటాళ్ల బియ్యా న్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకోగా, మండలంలోని గుడిపల్లి గ్రామంలో 20 క్వింటాళ్ల బియ్యం అక్రమ నిల్వలను పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లాలో రెండు  నెలల్లో ప్రజా పంపిణీ బియ్యం అక్రమార్కులపై 18 కేసులు నమోదు చే యగా, చౌక ధరల దుకాణాల డీలర్లపై ఏడు కేసులు నమోద య్యాయి. యాదాద్రి జిల్లాలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో బియ్యం అక్రమార్కులపై రెండు కేసులు నమోదుకాగా, కిరోసిన్‌ను దారి మళ్లించిన  వారిపై, డీలర్‌పై కేసులు నమోదు చేశారు. జిల్లాలో నమోదైన 25 కేసులలో  31,30,610 రూపాయల విలువగల సరుకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4,50400 ఆహార భద్రతాకార్డులు ఉండగా, 2082 చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతీ మనిషికి ఆరు కేజీల చొప్పున 18716.886 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. దీనికిగాను ప్రభుత్వం నెలకు 20కోట్ల రూపాయల చొప్పున సంవత్సరానికి 244కోట్ల రూపాయల సబ్సీడీగా చెల్లిస్తోంది. విభజన తర్వాత నల్లగొండ జిల్లాలో 1007 చౌక ధరల దుకాణాల ద్వారా 8703.439 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం ప్రజలకు  పంపిణీ చేస్తుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి పేదలకు ప్రభుత్వం బియ్యాన్ని సరఫరా చేస్తుండగా చౌక ధరల దుకాణా డీలర్లు, దళారీలు, కొందరు పౌరసరఫరాల, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై బియ్యాన్ని నల్ల బజారుకు తరలిస్తున్నారు. వీటిని రైస్ మిల్లుల్లో పాలీష్ చేసి అధిక ధరగల సన్నబియ్యంతో కలిపి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బియ్యాన్ని, కిరోసిన్‌ను ప్రక్కదారి పట్టించే అక్రమార్కులపై 1955 నిత్యావసర వస్తువుల చట్టం క్రింద విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు కూడా పెడుతున్నారు. అయినప్పటికీ జిల్లాలో బియ్యాన్ని, కిరోసిన్‌ను అక్రమార్గం పట్టిస్తూనే ఉన్నారు. ఎక్కడో చోట విజిలెన్స్ అధికారులు దాడులు చేసి పట్టుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ దళారీల దోపిడి మాత్రం ఆగడంలేదు.