Home జగిత్యాల అనుమానం.. పెనుభూతం!

అనుమానం.. పెనుభూతం!

కుటుంబాలు అతలకుతలం
క్షణిక అవేశాలతో రక్తం చిందుతుంటే
అనాథలుగా మారుతున్న పిల్లలు
రాజీపడి బతకలేక ఘాతుకాలు
అక్రమ మోజులతో పిల్లల బతుకులు రోడ్డుపాలు
తప్పు చేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నాలు
ప్రశ్నార్థకంగా మారుతున్న పిల్లల బతుకులు
చెరో కొడుకును పంచుకున్న దంపతులు

Murder

కోరుట్ల రూరల్: క్షణిక అవేశాలతో రక్తం యేరులై పారుతుంది. దాంపత్య జీవితాలలో అనుమాన భూతాలతో కృర హత్యలకు ఊతం పోస్తున్నాయి. భార్య భర్తలలో తప్పులు ఎవరూ చేసిన వారు కన్న పిల్లల బతుకులు రోడ్డున పడుతున్నాయి. విచక్షణలు మరిచి దాడులకు పాల్పడుతుంటే అభం శుభం తెలియని చిన్నారులు అనాథలు గా మారుతున్నారు. తప్పుచేశావని ఒకనినొకరు నిందించుకుంటూ విడిపోతు పగలు ప్రతీకారాలు పెంచుకుపోతుంటే వందేళ్ళు కలిసి బతుకుతామని అగ్నిసాక్షిగా మూడు ముళ్ళ బంధంతో ఏడడుగులు వేసి చిన్నపాటి సమస్యలకే ఆ భందాలు వీడితే పంచభూతా లు ప్రశ్నించాలా. ప్రతి దాంపత్య జీవితంలో గొడవలు జరుగుతూనే ఉంటాయి. సమస్యలోచ్చినప్పుడు పెద్దల సమక్షంలో రాజీలుపడి బతికిన దంపతులు లేరంటారా. అక్రమ సంభందాల గుట్టు రట్టైన తరుణంలో విడిపోయి బతికున్న వారు లేరంటారా. ఏమైన అక్రమ మోజులను వీడి సక్రమ మార్గంలో జీవనం సాగించడం సాధ్యం కాదంటారా

కొడుకులను పంచుకున్న దంపతులు

పెద్దలు చూసిన సంబంధం ఒద్దని ప్రేమించి పెల్లి చేసుకున్నారు కోరుట్ల పట్టణానికి చెందిన ఓ ప్రేమికులు.పెద్దలను ఎదురించి కులాంతర వివాహాం చేసుకుని మరీ వేరు కాపురాం పెట్టారు. ఎనిమిదేళ్ళ వారి దాంపత్య జీవితంలో ఇద్దరు కొడుకులు జన్మించారు. ఇద్దరు మగపిల్లలే జన్మించారని ప్రేమ పెల్లి వద్దని వరించిన కుటుంబ సభ్యులు పంతం వీడి వారితో మమేకంగా మెదులుకుంటు పిల్లలను ప్రేమగా చూస్తుండేవారు. అదే క్రమంలో మరో వ్యక్తితో అక్రమ సంభంధ వ్యవహారం బహిర్గతం కావడంతో ఆ దంపతుల మధ్య తగాదలు మొదలుకాగా తప్పుచేసి దొరికి పోయిన కూడా ఆ మహిళ వరకట్నం కోసం తన భర్త తీవ్రంగా వేదిస్తున్నాడని ఠాణా మెట్లెక్కి అతితెలివి ప్రధర్శించగా పూర్తి ఆదారలను తన భర్త చూపడంతో ఆమే అవక్కైంది. చేసేది లేక తమ ఇద్దరు కుమారులను చెరొకరు పంచుకుని విడిపోవడం చర్చనీయంశమైంది.

భార్య హత్యకు అక్రమ సంబంధమే కారణమన్న భర్త

ఇటీవల కోరుట్ల పట్టణంలో ఓ భర్త తన భార్యను అక్రమ సంభంద నేపంతో హత్యచేశాడు. ఉపాది నిమిత్తం విదేశానికి వెల్లి తాను పంపిన 13 లక్షలు,20తులాల బంగారం భార్యకు పంపానని తాను స్వదేశానికి తిరిగొచ్చి ఆ డబ్బులు,బంగారంల వివరాలు చెప్పాలని కోరుతున్న క్రమంలో వారి మధ్య ద్వేశాలు చెలరేగాయని,కుల పెద్దల సమక్షంలో పంచాయితి పెట్టగా కేవలం ఒకలక్ష యాబై వేలు మాత్రమే అప్పు చెల్లించిందని మిగత డబ్బులు,బంగారం విషమై ప్రతిరోజు తమ మద్య వాదనలు జరుగుతునేవని అదే క్రమంలో 3 నెలల కింద ఆమే తన పుట్టింటికి వెల్లి పోవడంతో, చేసేదిలేక ఆమేను అంతమొందించాలనే కసితో ఆమే వద్దకు వెల్లి పిల్లలు బెంగ పడుతున్నారని, గొడవలు లేకుండా పిల్లలతో కలిసి జీవనం సాగిద్దామనే మాటలతో నమ్మించి తమ ఇంటికి చేరుకోగానే ఒగదిలో పథకం ప్రకారం ఏర్పాటు చేసుకున్న ఇనుప రాడ్‌తో తలపై విచక్షన రహితంగా దాడి చేసి చంపినట్టుగా విలేకరుల ముందు వివరించాడు.భార్య అక్కడికక్కడే మృతి చెందగా పోలీసులు అతగాడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అమ్మ అనంతలోకాలకు,నాన్న కటకటాల పాలవ్వడంతో పిల్లల బతుకులు మాత్రం ప్రశ్నార్థకంగా మారాడం పలువురిని కలిచివేసింది.