Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

100 మంది విద్యార్థినులకు అస్వస్థత

Food-Poisoning

ఆసిఫాబాద్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలోని కస్తూర్భా బాలికల స్కూల్‌లో సోమవారం కలుషిత ఆహారంతో 100 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం అల్పాహారం తిన్న తరువాత విద్యార్థినులకు ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పి ప్రారంభమయ్యాయి. దీంతో హాస్టల్ సిబ్బంది వెంటనే బాధితులను కౌటాల, సిర్పూర్ ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న డిఇఒ పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు.

Comments

comments