Home జాతీయ వార్తలు క్షీణిస్తున్న కరుణానిధి ఆరోగ్యం

క్షీణిస్తున్న కరుణానిధి ఆరోగ్యం

Chennai : illness to DMK Chief Karunanidhiచెన్నయ్ : డిఎంకె చీఫ్ కరుణానిధి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయనకు గత మూడు రోజులుగా జ్వరం వస్తోంది. గోపాలపురంలోని ఆయన నివాసంలోనే వైద్యులు చికిత్స చేస్తున్నారు. తమిళనాడు డిప్యూటీ సిఎం పన్నీర్ సెల్వం, నటుడు, రాజకీయవేత్త కమల్‌హాసన్, దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు కరుణానిధిని పరామర్శించారు. ఇదిలా ఉండగా కరుణానిధి ఆరోగ్యం నిలకడగానే ఉందని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ఆయన కొడుకు, డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తెలిపారు.

illness to DMK Chief Karunanidhi